కోటీశ్వరుల్లో కామన్ గా ఉండే అలవాటు ఇది.. అదే వారి సీక్రెటా..?
ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలనుకుంటారు. ఏ పనైనా చేసి సంతోషంగా బతకడానికి కావాల్సిన డబ్బు సంపాదించాలని కష్టపడుతుంటారు. కాని కొంతమంది మాత్రమే కోటీశ్వరులవుతారు. వారి ఎదుగుదలకు కారణమైన ముఖ్య అంశాల్లో తెల్లవారకముందే నిద్ర లేవడం ఒకటి. మరి ఆ టైంలో బిలీనియర్స్ ఎందుకు నిద్ర లేస్తున్నారో, నిపుణులు చెప్పిన విశేషాలు తెలుసుకుందామా..
ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ మెంట్..
తెల్లవారు జామున నిద్ర లేవడం వల్ల కాన్సన్‌ట్రేషన్(ఏకాగ్రత) ఎక్కువగా ఉంటుంది. ఇది బిజినెస్‌లో ప్రొడక్టివిటీని పెంచేందుకు ఆ సమయంలో నిర్ణయాలు తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయట.
పర్సనాలిటీ డెవలప్‌మెంట్..
సూర్యుడు రాకముందే నిద్ర లేచే చాలా మంది బిలినియర్లు ఎక్కువగా పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారట. అంతేకాకుండా మెడిటేషన్ చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. దీని వల్ల వ్యక్తిత్వ వికాశం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెంటల్ క్లారిటీ..
తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారట. ఎందుకంటే పరిసరాలు చాలా నిశ్శబ్దంగా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది. అందుకే చాలా మంది బిలీనియర్స్ తెల్లవారుజామునే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు.
సరైన నిద్రకు సహకారం..
త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవడం వల్ల నైట్ లేట్‌గా నిద్రపోవడం తగ్గిపోతుంది. ప్రతి రోజూ నిర్ధిష్ట సమయానికి పడుకొనేలా శరీరం అలవాటు పడుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం.
శారీరకంగా బలం..
బిలీనియర్ల జీవితంలో ప్రతినిమిషం చాలా విలువైంది. అందుకే వారు ఆరోగ్యం కాపాడుకోవడానికి తెల్లవారక ముందే నిద్ర లేస్తారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటానికి జిమ్ చేస్తారు. దీని వల్ల బాడీ మెటబాలిజం దెబ్బతినకుండా ఉంటుందట.
ఒత్తిడి దూరం..
తెల్లవారకముందే రోజు ప్రారంభించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. తొందరపాటు నిర్ణయాలు తీసుకొనేందుకు అవకాశం ఉండదట. రోజంతా చురుకుదనంగా ఉంటుంది. మైండ్, బాడీ శక్తి పెరుగుతుంది.
ప్లానింగ్ టైం..
తెల్లవారుజామున ఉండే ప్రశాంత వాతావరణం వ్యూహాత్మక ప్రణాళిక వేయడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందట. ఈ టైంలోనే సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటామట. అందుకే బిలియనీర్లు తెల్లవారకముందే లేచి ఆ రోజు తీసుకోవాల్సిన నిర్ణయాలను సిద్ధం చేసుకుంటారు.
క్రియేటవిటీ పెరుగుతుంది..
తెల్లవారుజామున ఉండే ప్రశాంత వాతావరణం మైండ్‌లో క్రియేటవిటీని పెంచడానికి ఉపయోగపడుతుందట. కొత్తదనంగా ఆలోచించడం, కొత్త ఆలోచనలు తయారు చేసుకోవడానికి పరిష్కారాలు కనుక్కోవడానికి ఈ సమయం చాలా ముఖ్యం.