- Home
- Business
- Gold Rate: ఆ ఏడాది కల్లా తులం బంగారం ఐదు లక్షల రూపాయలయ్యే ఛాన్స్, త్వరగా ఇప్పుడే కొనేయండి
Gold Rate: ఆ ఏడాది కల్లా తులం బంగారం ఐదు లక్షల రూపాయలయ్యే ఛాన్స్, త్వరగా ఇప్పుడే కొనేయండి
బంగారం ధర (Gold Rate) బుల్లెట్ ట్రైన్ లా పరుగులు తీస్తోంది. ఇలాగే కొనసాగితే మరొక మూడేళ్లలో అది ఐదు లక్షల రూపాయలకు చేరుకోవచ్చు. కాబట్టి ముందే కొని పెట్టుకోవడం ఉత్తమం.

పెరిగిపోతున్న బంగారం ధరలు
మన దేశ ఆర్థిక వ్యవస్థలో బంగారానికి ఉన్న స్థానం ఎంతో గొప్పది. సాంస్కృతిక జీవనంలో కూడా బంగారానిది పెద్దపీటే. పెళ్లిళ్లు, పేరంటాలు, ఉత్సవాలు ఏవైనా కూడా మహిళల మెడలో బంగారంతో మెరిసిపోవాల్సిందే. బంగారాన్ని కేవలం ఒక వస్తువుగా చూడరు. దాన్ని లక్ష్మీదేవి రూపంలో పూజిస్తారు. అందుకే మన దేశంలో విపరీతంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు చూస్తూ ఉంటే కొన్నేళ్లు దాటాక బంగారాన్ని కొనడం కష్టమేమో అన్న భయం వేస్తుంది. ఇప్పటికే మధ్య తరగతి, పేద ప్రజలకు బంగారం దూరమైపోయింది.
1990లో పదిగ్రాముల ధర
ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం 10 గ్రాముల బంగారం 1,20,000 రూపాయలు దాటిపోయింది. ఇలాగే కొనసాగితే కనీసం రెండు మూడేళ్లలో బంగారం ధనవంతుల వస్తువుగా మారిపోతుంది. సాధారణ మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని చూడడమే తప్ప కొనలేరు. భారతదేశంలో బంగారం ధరలను చూస్తే మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 1950లో 10 గ్రాముల బంగారం కేవలం 99 రూపాయలు ఉండేది. అదే 1980 నాటికి 1330 రూపాయలకి పెరిగింది. ఇక 1990లో 10 గ్రాముల బంగారం రూ.3,200గా నమోదయింది.
గత మూడేళ్లలో ధరలు
ఈ మధ్యకాలంలో చూస్తే 2023 నాటికి 10 గ్రాముల బంగారం ద్వారా 50వేల రూపాయల మార్కును దాటింది. అప్పుడే బంగారం ఎంత పెరిగిపోతుందో అని అందరూ భయపడ్డారు. కానీ వారు ఊహించని విధంగా ఇప్పుడు దానికి మూడు రెట్లు పెరిగింది. 2024లో 10 గ్రాముల బంగారం ధర 72,770 రూపాయలకు చేరింది. ప్రస్తుతం 15 వేల రూపాయలు దాటిపోయింది.
2028 నాటికి ధర
బంగారం వృద్ధి రేటు ఇలాగే స్థిరంగా కొనసాగితే దాని ధరలు మరింతగా పెరుగుతాయి. 2026 చివరి నాటికి రెండు లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది. ఇక 2027 చివరి నాటికి బంగారం ధర 10 గ్రాములు 3,54,000 వేల రూపాయలు దాటిపోవచ్చు. 2028 చివరినాటికి ఐదు లక్షల రూపాయలకు 10 గ్రాముల బంగారం చేరుకోవచ్చు. కాబట్టి ముందుగానే మీరు ఎంతో కొంత బంగారాన్ని కొని పెట్టుకుంటే ఉత్తమం.
గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది?
బంగారం ఇంతగా పెరగడానికి కారణం ద్రవ్యోల్భణం పెరగడం, రూపాయి విలువ తగ్గిపోవడం, ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేయడం వంటివన్నీ అని చెప్పుకోవాలి. మన దేశం బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకుంటుంది. అయితే దిగుమతి చేసుకున్న బంగారానికి రూపాయిల్లో కాకుండా డాలర్లలో ధరను చెల్లిస్తాము. రూపాయి బలహీన పడుతున్న కొద్ది బంగారాన్ని మరింత ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. రెండేళ్లలో ఆర్బీఐ బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసినట్టు సమాచారం.