House Buying: భార్య లేదా తల్లి పేరుతో ఇల్లు కొంటే ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి
మన దేశంలో తల్లి లేదా భార్యా పేరు మీద ఆస్తి కొనుగోలు (House Buying) చేయడం వల్ల ఎంతో లాభం ఉంది. కొన్ని లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎన్నో రకాల ఛార్జీలు కూడా తగ్గుతాయి.

ఎంత ఆదా అవుతుంది?
మనదేశంలో భూమి, ఇల్లు కొనే వారి సంఖ్య ఎక్కువ. అయితే వాటిని ఎక్కువ మంది మగవారి పేరు మీదే కొనుగోలు చేసి పెట్టుకుంటారు. నిజానికి వాటిని భర్తల పేరు మీద కాకుండా భార్య పేరు మీద తల్లి పేరు మీద కొనడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ కోసం వసూలు చేసే రుసుము పురుషులకంటే మహిళలకు చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు ఒకటి నుంచి రెండు శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు రెండు కోట్ల విలువైన ఆస్తిని కొంటే స్టాంప్ డ్యూటీ మీకు నాలుగు లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.
హోమ్‌లోన్ తక్కువ వడ్డీకి
ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. భార్య లేదా తల్లి పేరుతో ఆస్తి కొనుగోలు చేయడం వల్ల ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. అలాగే చట్టపరమైన ఎన్నో లాభాలను పొందవచ్చని వివరిస్తున్నారు. బ్యాంకులు కూడా మహిళలకు అది తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ సదుపాయాన్ని ఇస్తుంది. ఇది 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు ఉండవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా కూడా మహిళల కోసం వడ్డీ పై సబ్సిడీ ఉంటుంది. కొన్ని లక్షల వరకు మీరు ఈ పద్ధతిలో ఆదా చేసుకోవచ్చు.
జాయింట్ ఓనర్లు ఉంటేనే బెటర్
భర్త తన పేరు కూడా ఉండాలని కోరుకుంటే భార్యాభర్తలిద్దరూ జాయింట్ గా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హోమ్ లోన్ పై ఎంతో ప్రభావం కనిపిస్తుంది. తక్కువ పన్ను దీనిపై పడుతుంది. జాయింట్ గా కొనుగోలు చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా సెక్షన్ 80సి కింద పన్ను చెల్లింపులో లాభాలను పొందుతారు. జాయింట్ గా హోమ్ లోన్ తీసుకోవడం వల్ల వడ్డీ పై లాభం కూడా పెరుగుతుంది. సింగిల్ ఓనర్ కన్నా జాయింట్ ఓనర్లకు వడ్డీ మొత్తం ఎక్కువ తగ్గే అవకాశం ఉంది.
ఇదొక లాభం
భర్త వ్యాపారం చేసి నష్టపోతే అప్పుల వారు అతని పేరు మీద ఉన్న ఆస్తిని లాక్కోగలరు. కానీ అదే ఆస్తి భార్య పేరు మీద ఉంటే వారు ఏమీ చేయలేరు. అప్పు చేసిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తులను తీసుకునే హక్కు మాత్రమే వారికి ఉంటుంది. భార్య పేరు మీద ఉన్న భాగాన్ని వారు తీసుకోలేరు. కాబట్టి ఏదైనా ఆస్తిక కొనేటప్పుడు ఖచ్చితంగా మీ భార్య లేదా తల్లి పేరును కూడా జాయింట్ ఓనర్ గా పెట్టండి. దీనివల్ల మీకు రిస్కు తగ్గుతుంది.
లోన్ ఎవరు కడతారో వారిదే ఆస్తి
భార్య పేరు మీద ఆస్తి కొన్న తర్వాత ఆమె మీ నుంచి విడిపోయినా, లోన్ తిరిగి చెల్లించడానికి ఆమె ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోయినా.. మీకు ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే అద్దె భర్తకే దక్కుతుంది. దానికి ఆ ఆస్తికి లోన్ ఎవరు కడుతున్నారో ప్రూఫ్స్ దగ్గర పెట్టుకుంటే చాలు.. ఆ లోను తిరిగి కట్టే వారికే ఆ ప్రాపర్టీ పై అధికారాలు ఉంటాయి.