Diwali: దీపావళికి గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లోకి డబ్బులు పడే ఛాన్స్
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దీపావళి (Diwali) సందర్భంగా రైతులకు శుభవార్తను మోసుకురాబోతోంది. పీఎం కిసాన్ యోజన డబ్బులను ఈ సంవత్సరం దీపావళికి రైతులు ఖాతాలో వేసేందుకు సిద్ధమవుతోంది.

పీఎం కిసాన్ యోజన
రైతులను ఆదుకునేందుకు ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన. ఈ పథకం కింద ఏటా ఆరువేల రూపాయలను మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో వేస్తారు. ఫిబ్రవరి 24, 2019 నుంచి ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకానికి ప్రతి ఏటా 75 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు.
రెండువేల రూపాయలు ఖాతాలోకి
దీపావళికి రైతుల అకౌంట్లోకి 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 ను రైతుల ఖాతాలో వేస్తారు. చివరగా ఈ ఏడాది ఆగస్టు 2025లో విడుదల చేశారు. నాలుగు నెలలు గడిచిన తర్వాత తిరిగి 2,000 రూపాయలు వేయాలి. అయితే ఈసారి ప్రభుత్వం ఇంకొంచం ముందుగానే దీపావళికి 2000 రూపాయలు రైతుల ఖాతాలో వేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఏటా ఆరువేల రూపాయలు
పీఎం కిసాన్ యోజన ద్వారా 6000 రూపాయలు రైతులకు ప్రతి ఏటా లభిస్తుండగా... ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీం కింద 14 వేల రూపాయలు అందిస్తోంది. అంటే ఏటా రైతుల ఖాతాల్లోకి 20వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సహాయాన్ని అందజేస్తున్నాయి.
ఇలా చెక్ చేసుకోండి
పీఎం కిసాన్ వెబ్ సైట్ pmkisan.gov.in వెళ్లి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవడం మంచిది. హోం పేజీలో బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీ రాష్ట్రము, జిల్లా, విలేజ్ వంటి వివరాలను సెలెక్ట్ చేయండి. తర్వాత వచ్చే నివేదికపై క్లిక్ చేయండి. మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.