గూగుల్‌కు రూ.1,337 కోట్ల జరిమానా విధించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా...కారణం ఇదే..
కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI) గూగుల్‌కు రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. ఇతర కంపెనీల అవకాశాలను దెబ్బతీసేలా గూగుల్ వ్యవహరిస్తోందని, అందుకే ఈ జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ పేర్కొంది.

అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI) గూగుల్‌కు రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా సంస్థ, దేశంలోని కార్పొరేషన్లు న్యాయమైన పద్ధతిలో వ్యాపారం చేస్తున్నాయో లేదో పర్యవేక్షించి, నియంత్రిస్తుంది. దాని ఆధారంగా ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ గూగుల్ పై సీసీఐ రూ.1,337 కోట్ల జరిమానా విధించింది.
ప్రపంచంలో కోట్లాదిమంది మంది యూజర్స్ కలిగి ఉన్న గూగుల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నడుపుతోంది. CCI సంస్థ ప్రకారం, Google ప్లే స్టోర్, Google సెర్చ్ బ్రౌజర్, Google Chrome, YouTube యాప్‌లను. Google ప్రీ-ఇన్‌స్టాలేషన్ విక్రయాల ద్వారా Google తన పోటీదారులు ప్రభావితం చేస్తున్నది.
అంటే ముందుగానే ఫోన్ కొనుగోలు చేసినప్పుడే పైన పేర్కొన్న యాప్స్ అన్ని కూడా ఫోన్ లలో ఇన్స్టలేషన్ చేయకుండానే అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా ఇతర కంపెనీలకు పెద్ద దెబ్బ తగులుతోంది. వినియోగదారులు ఇన్స్టాల్ చేయకుండానే గూగుల్ కు సంబంధించిన అన్ని యాప్స్ ఫోన్లలో ఉంటున్నాయి. దీనిపై ఇప్పటికే సీసీఐకు పలు ఫిర్యాదులు అందాయి.
ఫలితంగా, ఇతర కంపెనీల రాబడి దెబ్బతింటుంది. వ్యాపారంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండదని. అందువల్ల నిబంధనలను ఉల్లంఘించినందుకు గూగుల్ కంపెనీకి రూ.1,337 జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ తెలిపింది. వచ్చే 30 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని, ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సంబంధిత పత్రాలను సమర్పించాలని, లేదంటే అదనపు జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీసీఐ హెచ్చరించింది.
అంతేకాకుండా, గూగుల్ ఇలాంటి అక్రమ వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని CCI పేర్కొంది. Google, MakeMyTrip, Goibibo OYO వంటి వాటికి CCI మొత్తం 392 కోట్ల రూపాయల జరిమానా విధించింది.