వరల్డ్ టాప్ 10 ధనవంతుల జాబితాలో టెస్లా సి‌ఈ‌ఓ డౌన్.. ఇప్పుడు రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాట్..

First Published May 18, 2021, 3:46 PM IST

స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానం కోల్పోయారు. ఎలోన్ మస్క్ ఇప్పుడు రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎల్‌విఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) బెర్నార్డ్ ఆర్నాట్ ఇప్పుడు రెండవ ధనవంతుడిగా అవతరించారు.