MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Tata Tiago: టాటా కార్లలో చీప్ అండ్ బెస్ట్ కారు ఇదే. దీనిపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్. ఆలస్యం చేయకండి

Tata Tiago: టాటా కార్లలో చీప్ అండ్ బెస్ట్ కారు ఇదే. దీనిపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్. ఆలస్యం చేయకండి

Tata Tiago: మీరు మీ ఫ్యామిలీ కోసం చీప్ అండ్ బెస్ట్ కారు కోసం చూస్తున్నారా? టాటా టియోగో మీకు సరైన ఆప్షన్. ఎందుకంటే టాటా కంపెనీ కార్లలో తక్కువ ధర ఉన్న కారు టియాగో మాత్రమే. ప్రస్తుతం టాటా కంపెనీ ఈ కారుపై మంచి డిస్కౌంట్ ప్రకటించింది. ఈ కారుకు పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ కారు ధర, బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 05 2025, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న టాటాలో చాలా తక్కువ ధర కారు టియాగోనే. ఈ కారులో 17 రకాల మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి. టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ.4,99,990 నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఈ టాటా కార్లలో 3 ఆఫర్లు ఉన్నాయి. టాటా టియాగో MY2024 మోడల్‌లో ఈ తగ్గింపు ఉంది. ఈ కారు కొంటే రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

24

టాటా టియాగోలో రూ.30 వేల వరకు తగ్గింపు

టాటా టియాగోలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ కారు MY2024 మాన్యువల్ పెట్రోల్ వేరియంట్‌కు రూ.20,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఆఫర్ XM, XT (O) మోడళ్లకు వర్తించదు. టాటా టియాగో సీఎన్‌జీ మోడల్‌కు రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. టాటా టియాగో NRGలోని అన్ని మోడళ్లపై రూ.30,000 వరకు తగ్గింపు ఉంది.
 

ఇది కూడా చదవండి: ధర తక్కువ.. సేఫ్టీ ఎక్కువ, రూ.6 లక్షల కంటే తక్కువకే 6 ఎయిర్ బ్యాగ్స్‌తో రెండు కార్లు

34

టాటా టియాగో పవర్

ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే 1,199 సీసీ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. కారులో ఉన్న ఈ ఇంజిన్ 6,000 rpmలో 86 bhp పవర్‌ను, 3,300 rpmలో 113 Nm టార్క్ ను అందిస్తుంది. టాటా టియాగో సీఎన్‌జీ కూడా మార్కెట్లో దొరుకుతుంది. టియాగో సీఎన్‌జీ వేరియంట్ లో ఉన్న ఇంజిన్ 6,000 rpm-లో 75.5 పీఎస్ పవర్‌ను, 3,500 rpmలో 96.5 ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది. ఈ కారుకు 242 లీటర్ల బూట్ స్పేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ టాటా కారులో ముందు డిస్క్ బ్రేక్స్, వెనక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం తక్కువ.

44

టాటా టియాగో మైలేజ్

టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.09 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లో ఈ కారు లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే సీఎన్‌జీ మోడల్‌లో ఈ కారు మంచి మైలేజ్ ఇస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 26.49 కిలోమీటర్లు/కిలోగ్రాము మైలేజ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 28.06 కిలోమీటర్లు/కిలోగ్రాము మైలేజ్ ఇస్తుంది.

నోట్: టియాగో ధరలు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. మీ ప్రాంతంలో డీలర్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇన్వెస్టర్లకు పీడకలగా మారిన స్టాక్.. రూ. 100 పెడితే మిగిలింది రూ. 14 మాత్రమే..
Recommended image2
CIBIL Score: క్రెడిట్ స్కోర్ సూపర్ ఉన్నా లోన్ రావట్లేదా.! తప్పు ఎక్కడ జరిగిందంటే.?
Recommended image3
Gold Rate: షాకిస్తున్న బంగారం, వెండి రేట్లు, 2రోజుల్లో రూ.11,500 జంప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved