MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కొత్త టాటా నానో ముందు లగ్జరీ కార్లు కూడా కనిపించవు: మార్కెట్ లో అప్డేట్ వెర్షన్

కొత్త టాటా నానో ముందు లగ్జరీ కార్లు కూడా కనిపించవు: మార్కెట్ లో అప్డేట్ వెర్షన్

ఈ లోకాన్ని వీడినప్పటికీ రతన్ టాటా అనుకున్నది సాధించారు. సామాన్యులకు బైక్ ధరకే కారు అందించాలనే ఉద్దేశంతో రతన్ టాటా రూపొందించిన నానో కారు కొత్త డిజైన్ తో మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసింది. కొత్త లుక్, కొత్త ఫీచర్స్ చూస్తుంటే లగ్జరీ కార్లకు ఏం తక్కువ కాకుండా కనిపిస్తోంది. నానో కారులో వచ్చిన అప్డేషన్స్, మైలేజీ, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 05 2024, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రతన్ టాటా కలల కారు నానో కొత్త అప్డేట్ తో మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసింది. టాటా నానో ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా 2008లో మార్కెట్లోకి వచ్చింది. కుటుంబాలు పెద్దగా ఖర్చు చేయకుండా వాహన యజమాన్యాన్ని పొందాలని భావించి రతన్ టాటా ఈ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేశారు. ప్రారంభంలో ఈ కారు 1 లక్ష రూపాయల ప్రాథమిక ధరతో మార్కెట్‌లోకి విడుదలైంది. ప్రారంభంగా దీని డిజైన్, ధర, భద్రతా లక్షణాలు మంచి స్పందనను పొందాయి.

టాటా నానోపై మొదట్లో ఆసక్తి కలిగినా, మార్కెట్‌లో దీని అమ్మకాలు ఆశించినంతగా జరగలేదు. ఆర్థికంగా తక్కువ పెట్టుబడి చేసినా కొన్ని సాంకేతిక సమస్యలు, భద్రతా అంశాలపై ప్రశ్నలు, కస్టమర్ల అభిరుచులు, రహదారి భద్రతా అంశాలు ఈ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

నానో కారులో పలు మార్పులు తీసుకురావడానికి టాటా మోటార్స్ గతంలో చాలాసార్లు ప్రయత్నించింది. వేరే వేరే వేరియంట్లు, ఇతర మార్పులు తీసుకువచ్చినా అమ్మకాలను పెంచలేకపోయింది. చివరికి 2018లో టాటా మోటార్స్ అధికారికంగా నానో ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ పూర్తి అప్డేటెడ్ వెర్షన్ తో మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. 

ఆధునిక డిజైన్

కొత్త టాటా నానో అందం, సౌకర్యం రెండింటినీ కలిగి ఉంది. చిన్న సైజులోనే అధునిక డిజైన్ తో ఆకర్షణీయంగా ఉంది. ట్రాఫిక్ లో, పార్కింగ్ లో ఇబ్బంది లేకుండా నడిపేలా డిజైన్ చేశారు. కొత్త హెడ్ లైట్లు, బాడీ డిజైన్ తో అదిరిపోయే లుక్ ఉంది.

35

శక్తివంతమైన ఇంజిన్

624 సీసీ పెట్రోల్ ఇంజిన్ తో సూపర్ పెర్ఫార్మెన్స్, మైలేజ్ ఇస్తుంది. లిటరుకు 25-30 కిలోమీటర్ల మైలేజ్ తో డైలీ యూజ్ కి బెస్ట్. గంటకు 105 కి.మీ వేగంతో నగరంలో, హైవేలపై కూడా బాగా పనిచేస్తుంది.

అదిరిపోయే ఫీచర్స్

పవర్ విండోస్, ఏసీ, మ్యూజిక్ సిస్టం లాంటి ఫీచర్స్ తో కొత్త నానో ఇంటీరియర్ అదుర్స్. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రిడిజైన్ చేసిన సీట్లు, లెగ్ రూమ్ తో నలుగురు కూడా కంఫర్టబుల్ గా ప్రయాణించవచ్చు.

45

టెక్నాలజీ

కొత్త టెక్నాలజీతో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మోడ్రన్ ఎంటర్టైన్మెంట్ సిస్టం వంటి ఫీచర్స్ ఈ కారుకు కొత్త అందాన్ని తెచ్చాయి. లగ్జరీ కార్లకు ఎక్కడా తక్కువ కాని ఫీచర్స్ తో ఈ కారు పోటీగా నిలుస్తోంది. 

నగరానికి సూపర్

చిన్న సైజులో ఉండటం ఈ కారు ప్లస్ పాయింట్. టర్నింగ్ రేడియస్ తో ట్రాఫిక్ లో సులువుగా వెళ్ళడానికి ఈ కారు చాలా సౌకర్యంగా ఉంటుంది. సుమారు రూ.30 కి.మీ. వరకు మైలేజ్ ఇచ్చే ఈ కారు డైలీ యూజ్ కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 

భద్రత

కొత్త నానోలో భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. మెరుగైన మెటీరియల్స్ తో బలమైన బాడీని రూపొందించారు.

55

తక్కువ ధర

సుమారు రూ.2.5 లక్షల ధరతో కొత్త నానో అందుబాటులో ఉంది. EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సూపర్ అప్డేషన్స్ తో ఉన్న ఈ కారు చిన్న ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్. మీరు ఈ కారు కొనాలనుకుంటే ఒకసారి టాటా కార్స్ గురించి ఆన్ లైన్ లో గాని, టాటా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో గాని పూర్తి వివరాలు తెలుసుకోండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Summer Sale : ఆఫర్లే ఆఫర్లు.. రూ.62000 ఏసీ కేవలం రూ.36000 కే..!
Recommended image2
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?
Recommended image3
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved