టాటా కార్లు ఎంత సేఫ్టీయో తెలుసా? క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ ఇవిగో
కార్లు మనకి ఎంత రక్షణ కల్పిస్తాయో తెలుసుకొనేందుకు క్రాష్ టెస్ట్ చేస్తారు. అంటే మోడల్ కారును ఆర్టిఫీషియల్ గా యాక్సిడెంట్ కు గురయ్యేలా చేస్తారు. దీని ఫలితాల ఆధారంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇస్తారు. మరి టాటా కార్లకు ఇటీవల నిర్వహించిన NCAP క్రాష్ టెస్ట్‌లో సేఫ్టీ రేటింగ్ ఎంత వచ్చిందో మీకు తెలుసా? టాటా కార్ల భద్రత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
టాటా కారు కొనాలనుకుంటున్నారా? కారు కొనే ముందు టాటా కార్ల భద్రతా పరీక్ష ఫలితాల గురించి ఇక్కడ వివరాలున్నాయి.
భారతదేశంలో ప్రస్తుతం అమ్మకంలో ఉన్న చాలా కార్లు NCAP క్రాష్ టెస్ట్ ఫలితాల ఆధారంగానే మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. వాటి సేఫ్టీ రేటింగ్ తెలుసుకొని కార్లు కొనుక్కోవడం చాలా మంచి ఆలోచన. ప్రస్తుతం ఇండియాలో తిరిగే చాలా కార్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. పెద్దలు, పిల్లలకు పూర్తి భద్రతను అందిస్తాయని NCAP తెలిపింది. మీరు టాటా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇక్కడ కంపెనీకి చెందని పలు మోడల్స్ సేఫ్టీ రేటింగ్ వివరాలు ఉన్నాయి. ఓ సారి పరిశీలించండి.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ EV క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దాని తర్వాత నెక్సాన్ (ICE) కూడా క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించింది. అంటే పెద్దలకు రక్షణ కల్పించడంలో 32.00కి 29.41 పాయింట్లు సాధించింది. అదేవిధంగా పిల్లల భద్రతకు 49.00కి 43.83 పాయింట్లు లభించాయి.
టాటా హారియర్
ఈ SUV భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. పెద్దల భద్రతలో 32.00కి 30.08 పాయింట్లు సాధించింది. పిల్లల భద్రతకు 49.00కి 44.54 పాయింట్లు లభించాయి. దీని భద్రతా స్కోరు టాటా సఫారీ మాదిరిగానే ఉంది.
టాటా సఫారీ
టాటా పోర్ట్‌ఫోలియోలో ఉన్న లగ్జరీ, ప్రీమియం మోడళ్లలో సఫారీ SUV ఒకటి. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ SUV 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. పెద్దల భద్రతకు 32.00కి 30.08 పాయింట్లు తెచ్చుకుంది. పిల్లల భద్రతకు 49.00కి 44.54 పాయింట్లు లభించాయి.
టాటా నెక్సాన్ EV
టాటా కర్వ్ EV రాకముందు నెక్సాన్ EV టాటా ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ప్రముఖ మోడల్‌గా ఉండేది. ఈ ఎలక్ట్రిక్ కారు క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. పెద్దల భద్రతకు 32.00కి 29.86 పాయింట్లు రాగా, పిల్లల భద్రతకు 49.00కి 44.95 పాయింట్లు లభించాయి.
టాటా కర్వ్ EV
టాటా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో కొత్త మోడల్ కర్వ్ EV. మార్కెట్లో ఈ కారుకు మంచి ఆదరణ ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఇండియన్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. టాటా తొలి SUV కూపే ఇదే. పెద్దల భద్రతకు 32.00కి 30.81 పాయింట్లు మరియు పిల్లల భద్రతకు 49.00కి 44.83 పాయింట్లు కలిగి ఉంది.
టాటా పంచ్ EV
టాటా కంపెనీకి చెందిన అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో పంచ్ ఒకటి. మార్కెట్ లో ఈ కారుకు ఎంత క్రేజ్ ఉందంటే.. గత 5, 6 నెలలుగా అగ్రస్థానంలో ఉంది. భద్రతా పరీక్షలో 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. పెద్దల భద్రతకు 32.00కి 31.46 పాయింట్లు, పిల్లల భద్రతకు 49.00కి 45.00 పాయింట్లు లభించాయి.
టాటా కర్వ్
టాటా కర్వ్ ICE వెర్షన్ ఇండియన్ NCAPలో 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది. భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌తో పోటీ పడుతుంది. ఈ కారు పెద్దల భద్రతకు 32.00కి 29.50 పాయింట్లు, పిల్లల భద్రతకు 49.00కి 43.66 పాయింట్లు పొందింది.