MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Elon Musk vs SamAltman: మస్క్ vs ఆల్ట్‌మ్యాన్.. నువ్వు పెద్ద స్కామర్ అంటే.. నువ్వే పెద్ద ఫ్రాడ్ అంటూ కొట్టుకున్న టెక్ బాస్‌లు !

Elon Musk vs SamAltman: మస్క్ vs ఆల్ట్‌మ్యాన్.. నువ్వు పెద్ద స్కామర్ అంటే.. నువ్వే పెద్ద ఫ్రాడ్ అంటూ కొట్టుకున్న టెక్ బాస్‌లు !

Elon Musk vs SamAltman: ఓపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మ్యాన్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ సోషల్ మీడియా లో మాటల యుద్ధం ముదిరింది. ఎక్స్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు ఈ వివాదం ఎందుకొచ్చింది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 12 2026, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్కామ్ ఆల్ట్‌మ్యాన్ అంటూ మస్క్ కౌంటర్.. గట్టిగా తిప్పికొట్టిన ఓపెన్ఏఐ చీఫ్
Image Credit : ChatGPT

స్కామ్ ఆల్ట్‌మ్యాన్ అంటూ మస్క్ కౌంటర్.. గట్టిగా తిప్పికొట్టిన ఓపెన్ఏఐ చీఫ్

సిలికాన్ వ్యాలీలో ఇద్దరు టెక్ దిగ్గజాల మధ్య కోల్డ్ వార్ మళ్లీ పీక్స్‌కు చేరింది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మ్యాన్ మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదం ఎక్స్ లో మరోసారి రచ్చకెక్కింది. మస్క్ తన పాత విమర్శలకే పదును పెడుతూ సామ్ ఆల్ట్‌మ్యాన్‌ను స్కామ్ ఆల్ట్‌మ్యాన్ అని పిలవడంతో ఈ గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే ఈసారి ఆల్ట్‌మ్యాన్ అస్సలు తగ్గలేదు. మస్క్ వేసిన ప్రతి విమర్శకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గొడవ ఎక్కడ మొదలైంది?
Image Credit : Asianet News

గొడవ ఎక్కడ మొదలైంది?

ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ సామ్ ఆల్ట్‌మ్యాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆల్ట్‌మ్యాన్ మోసాలు చేయడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడంటూ మస్క్ కామెంట్ చేశారు. ఓపెన్ఏఐ చీఫ్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఒక పోస్ట్‌ను మస్క్ మరింత హైలైట్ చేశారు.

దీనికి సామ్ ఆల్ట్‌మ్యాన్ కూడా కొన్ని గంటల్లోనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మస్క్ తన సొంత లాభాల కోసం, ఎక్స్ఏఐ కొలోసస్ డేటా సెంటర్ ప్రాజెక్టుల కోసం పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్టర్లను షార్ట్ టర్మ్ స్పేస్ డేటా సెంటర్ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారంటూ ఆల్ట్‌మ్యాన్ ఎదురుదాడి చేశారు.

35
2015 నుండి ఇప్పటివరకు ఏం జరిగింది?
Image Credit : Getty

2015 నుండి ఇప్పటివరకు ఏం జరిగింది?

మస్క్, ఆల్ట్‌మ్యాన్ మధ్య వివాదం ఈనాటిది కాదు. దీనికి పెద్ద హిస్టరీనే ఉంది. 2015 లో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మ్యాన్, గ్రెగ్ బ్రాక్‌మన్ కలిసి ఓపెన్ఏఐ సంస్థను ఒక నాన్ ప్రాఫిట్ సంస్థగా స్థాపించారు. మానవాళి ప్రయోజనాల కోసం సురక్షితమైన ఏఐని అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. దీని కోసం మస్క్ దాదాపు 44 మిలియన్ డాలర్ల విరాళం కూడా ఇచ్చారు. కానీ 2018 లో టెస్లా ఏఐ ప్రాజెక్టులతో ప్రయోజనాల ఘర్షణ వస్తుందనే కారణంతో మస్క్ ఓపెన్ఏఐ బోర్డు నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎక్స్ఏఐ అనే సొంత ఏఐ సంస్థను ప్రారంభించారు.

45
కోర్టు మెట్లెక్కిన వివాదం
Image Credit : our own

కోర్టు మెట్లెక్కిన వివాదం

2024 లో ఎలాన్ మస్క్ ఓపెన్ఏఐ, ఆల్ట్‌మ్యాన్, బ్రాక్‌మన్‌లపై కోర్టులో కేసు వేశారు. ఓపెన్ఏఐ తన అసలు లక్ష్యాన్ని వదిలేసి, లాభాపేక్షతో కూడిన సంస్థగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 2026 లో ఈ వివాదం మరింత ముదిరింది. మస్క్ ఓపెన్ఏఐ రీస్ట్రక్చరింగ్‌కు సంబంధించి దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ఆల్ట్‌మ్యాన్‌ను స్కామ్ ఆల్ట్‌మ్యాన్ అని, బ్రాక్‌మన్‌ను స్టాక్‌మ్యాన్ అని ఎక్స్ లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

55
జ్యూరీ తీర్పు.. మస్క్ అప్పీల్
Image Credit : Getty

జ్యూరీ తీర్పు.. మస్క్ అప్పీల్

మే 2026 లో ఈ కేసు ట్రయల్‌కు వచ్చింది. కోర్టులో మస్క్ సాక్ష్యం చెబుతూ.. తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన ఎక్స్ ఏఐ కి చెందిన గ్రోక్ ఏఐ మోడల్ కొంతవరకు ఓపెన్ఏఐ మోడల్స్‌పైనే ట్రైన్ అయిందని కూడా ఆయన ఒప్పుకున్నారు. మే 18, 2026 న జ్యూరీ మస్క్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. మస్క్ చేసిన ఆరోపణలు కాలపరిమితి దాటిపోయాయని కోర్టు తేల్చింది.

కానీ మస్క్ తగ్గకుండా పైకోర్టుకు అప్పీల్ చేస్తానని ప్రకటించారు. ఆల్ట్‌మ్యాన్, బ్రాక్‌మన్ ఒక చారిటీని దొంగిలించి కోటీశ్వరులు అయ్యారంటూ మస్క్ మళ్లీ ఆరోపించారు. ప్రస్తుతం ఈ అప్పీల్ ప్రక్రియ నడుస్తుండగానే, ఇద్దరి మధ్య ఎక్స్ లో తాజా మాటల యుద్ధం మొదలైంది. మస్క్ ఆరోపణలు అర్థరహితమైనవని ఆల్ట్‌మ్యాన్ కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి సిలికాన్ వ్యాలీలోని ఈ బిగ్గెస్ట్ ఏఐ వార్ ఇప్పుడు అంత త్వరగా ముగిసేలా కనిపించడం లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సామాన్యుడిపై మ‌రో దెబ్బ‌.. ఈ సారి మొబైల్ రీచార్జ్‌ల వంతు, ఎంత పెర‌గ‌నున్నాయంటే
Recommended image2
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image3
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Related Stories
Recommended image1
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సైట్ వచ్చేసింది.. మారిన UAN యాక్టివేషన్ రూల్స్, కొత్త ప్రాసెస్ ఇదే
Recommended image2
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved