సుందర్ పిచాయ్ సాలరీ 2 మిలియన్లే... మరి బిలియనీర్ ఎలా అయ్యారబ్బా..!
అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్, ఆల్ఫాబెట్ కంపెనీ సీఈవో స్థాయికి చేరుకోవడమే సుందర్ పిచాయ్ సాధించిన గొప్ప విజయం. కానీ అతడు ఇప్పుడు మరో ఘనత సాధించాడు. అదేంటో తెలుసా?

బిలియనీర్స్ జాబితాలో సుందర్ పిచాయ్
భారత సంతతికి చెెందిన సుందర్ పిచాయ్ ప్రస్తుతం ఆల్ఫాబెట్, గూగుల్ కంపనీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇలా గొప్ప కంపనీలో అత్యున్నత స్థానానికి చేరుకుని చాలా గొప్పపేరు సంపాదించారు. అయితేే పేరుతో పాటే భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు సుందర్ పిచాయ్… దీంతో 2025లో బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. ఆయన ఆస్తి 1.1 బిలియన్ డాలర్లకు చేరింది.
స్టెనోగ్రాఫర్ కొడుకు నుండి బిలియనీర్ వరకు
సుందర్ పిచాయ్ అతి సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. రెండు గదుల అపార్ట్‌మెంట్‌లోనే సుందర్ పిచాయ్‌కి చిన్నతనమంతా గడిచింది… ఆయనకు ఆధునిక సౌకర్యాలేవీ లేవు. చెన్నైలో స్కూల్ చదువు పూర్తి చేసారు… ఖరగ్‌పూర్‌లోని IIT నుండి ఇంజనీరింగ్ పట్టా పొందారు.
గూగుల్ లో సుందర్ పిచాయ్ ప్రస్థానం
సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరారు. గూగుల్ క్రోమ్, జిమెయిల్, ఆండ్రాయిడ్ వంటి కీలక ఉత్పత్తులకు నాయకత్వం వహించి ఉన్నత స్థాయికి ఎదిగారు. 2015లో గూగుల్ CEOగా నియమితులయ్యారు.
సుందర్ పిచాయ్ ఆదాయం
సిలికాన్ వ్యాలీ ప్రమాణాలతో పోలిస్తే పిచాయ్ వార్షిక జీతం చాలా తక్కువ. సుమారు 2 మిలియన్ డాలర్లు. కానీ ఆయన నిజమైన సంపద షేర్లలో, పనితీరు ఆధారంగా లభించే బోనస్‌లలో ఉంది.
సుందర్ పిచాయ్ జీవితం
సుందర్ పిచాయ్ తన భార్య అంజలి పిచాయ్‌తో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. వీరిద్దరికి IITలో చదివే సమయంలో పరిచయం ఏర్పడింది. ఇదికాస్త ప్రేమ, పెళ్లిగా మారింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.