MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Wedding Muhurthams: సమ్మర్ మొత్తం పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. ఎన్ని ముహూర్తాలు ఉన్నాయో తెలుసా?

Wedding Muhurthams: సమ్మర్ మొత్తం పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. ఎన్ని ముహూర్తాలు ఉన్నాయో తెలుసా?

Wedding Muhurthams: ఈ ఏడాది వేసవంతా ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి. మూడు నెలల్లో మూడు ముళ్ల ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇప్పటి నుంచి కల్యాణ మండపాలు, బాజా భజంత్రీలు, క్యాటరింగ్ బుకింగ్ లు మొదలైపోయాయి. సమ్మర్ సీజన్ లో ఎన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయో తెలుసుకుందామా?

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 16 2025, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ ఏడాది సమ్మర్ లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే  తెలుగు రాష్ట్రాల్లో ఈ సమ్మర్ సీజన్ లోనే ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అందువల్ల చాలా మంది ఎండలను సైతం లెక్క చేయకుండా పెళ్లిళ్లు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే ఆసరాగా కల్యాణ మండపాలు, డెకరేషన్, క్యాటరింగ్, భాజా భజంత్రీలు ఇలా పెళ్లికి సంబంధించిన అన్ని విభాగాలకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సమ్మర్ సీజన్ లోనే పెళ్లిళ్లు ఎక్కువ జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ఏప్రిల్ నెలలో అనేక శుభ మూహూర్తాలు ఉండటంతో  చాలా చోట్ల పెళ్లిళ్ల కార్యక్రమాలతో మొదలైపోయాయి. మే, జూన్ నెలల్లో కూడా  శుభ మూహూర్తాలు ఉన్నాయట. మళ్లీ ఈ సీజన్ దాటితే ఆషాఢం వస్తుంది. పెళ్లి ముహూర్తాలు కావాలంటే ఆషాఢం దాటాల్సి ఉంటుంది. 

ఏప్రిల్ , మే, జూన్ నెలలో ఏఏ శుభ మూహూర్తాలు ఉన్నాయో ఇప్పడు తెలుసుకుందాం. 

35

ఏప్రిల్ నెలలో 16, 20, 21, 23, 30 శుభ మూహూర్తాలు ఉన్నాయని వేద పండితులు తెలిపారు. అదే విధంగా మేలో 1, 3, 4, 7, 8, 9, 10, 11, 14, 18, 19, 23, 24, 30 పెళ్లి మూహూర్తాలు ఉన్నాయట. జూన్ నెలలో 2, 4, 5, 6, 7, 8 వ తేదీల్లో వివాహానికి శుభప్రదమైన మూహూర్తాలు ఉన్నాయని పండితులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి ‘అయ్యబాబోయ్ పెళ్లి చేసుకోవాలా..’ అనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇవే కారణాలు. ఇలా చేస్తే అంతా హ్యాపీ

45

అంతా బిబీ బిజీ..

ఈ మూడు నెలల్లో పెళ్లి ముహూర్తాలు భారీగా ఉండటంతో క్యాటరీంగ్ వాళ్లు, సన్నాయి, బజాలు, డెకరేషన్, ఫోటోగ్రాఫర్లు, ఇలా పెళ్లికి సంబంధించిన అన్ని రకాల వ్యాపారులు చేతి నిండా పని దొరికిందని ఆనందంగా ఆర్డర్లు తీసుకుంటున్నారు. 

ఆషాఢం అప్పటి నుంచే..

జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాడ మాసం ఉంటుంది. దీంతో ఆ సమయంలో పెళ్లిళ్లు జరగవు. అయితే.. కొందరు పండితులు మాత్రం జూన్ 25 నుంచి మళ్లీ పెళ్లి ముహూర్తాలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. 

55

మారతున్న యువత ఆలోచన

ఈ సీజన్ లోనే ఎలాగైనా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేయాలని చాలా మంది తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే యువతలో పెళ్లిపై అభిప్రాయం మారిపోతోంది. ఒంటరిగా జీవించడమే బెస్ట్ అనే పరిస్థితి చాలా మంది యువత ఆలోచనల్లో కనిపిస్తోంది. ఈ మేరకు ఈ సీజన్ లో చేయకపోతే తర్వాత జరగడం కష్టమేనని చాలా మంది భావిస్తున్నారు. 

అక్షయ తృతీయ సందడి 

వీలైనంతగా చాలా మంది ఏప్రిల్, మే నెలలోనే పెళ్లళ్లకు రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 30 వ తేదీన మాత్రం భారీగా పెళ్లిళ్లు  జరగనున్నాయి. అక్షయ తృతీయ నేపథ్యంలో పెళ్లి చేసుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అందుకే ఆ ఒక్కరోజునే వేలల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి.  

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆధ్యాత్మిక విషయాలు
మహిళలు
పురుషులు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved