MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కోటి రూపాయలు సంపాదించడం మీ కలా.. ఇలా చేస్తే 20 ఏళ్లలో సాకారం, చాలా సింపుల్‌

కోటి రూపాయలు సంపాదించడం మీ కలా.. ఇలా చేస్తే 20 ఏళ్లలో సాకారం, చాలా సింపుల్‌

జీవితంలో కోటి రూపాయాలు సంపాదించాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అయితే ఎలాంటి ఆస్తులు లేకుండా కేవలం జీతం మీద ఆధారపడేవారు ఇది అసాధ్యమనే భావనలో ఉంటారు. అయితే సుకన్య సమృద్ధి యోజనతో 21 ఏళ్లలో ఇది సాధ్యమవుతుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 31 2024, 07:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం చాలా మంది మైండ్ సెట్ మారుతోంది. డబ్బులు పొదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం SIPల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ద్వారా అధిక లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. అయితే ఇందులో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందే ఒక మంచి పథకం అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అందిస్తోన్న ఈ పథకంతో కోటీ రూపాయాలు సేవ్ చేయొచ్చు. 

27

పోస్టాఫీస్ అందిస్తోన్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇది సాధ్యమే. ఈ పథకంలో నెలకు రూ. 12,500 డిపాజిట్ చేస్తూ వెళ్తే.. 21 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఈ పథకం వడ్డీ రేటు, డిపాజిట్ వ్యవధితో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

37

వడ్డీ రేటు 8.0% (2024-25 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి)

వ్యవధి: 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు మరియు 21 సంవత్సరాల వరకు పథకం మెచ్యూరిటీ ఉంటుంది. 

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చింది. 

47

రూ. కోటి ఎలా పొందాలంటే.. 

సుకన్య సమృద్ధి యోజనలో రూ. కోటి పొందాలంటే మీరు ప్రతీ నెలా నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ ఉండాలి. సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత వడ్డీ రేటు 8%గా ఉంది. ఇలా మీరు 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 12,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 

57

మీరు 15 సంవత్సరాల పాటు నిరంతరం డబ్బును డిపాజిట్ చేస్తే, మీ మొత్తం 12,500 x 12 x 15 = రూ. 22,50,000  అవుతుంది. ఇలా వరుసగా 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 12,500 డిపాజిట్ చేయడం ద్వారా మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చే సమయానికి రూ. కోటి అవుతుంది. 

67

మరికొన్ని విషయాలు.. 

వడ్డీ రేట్లు కాలానుగుణంగా మార్పులకు లోబడి ఉంటాయి. ఇది మొత్తంలో స్వల్ప వ్యత్యాసాలకు దారితీయవచ్చు. పథకం నిబంధనల ప్రకారం, గరిష్ట వార్షిక పెట్టుబడి పరిమితిని రూ. 1,50,000గా నిర్ణయించారు. 

77

సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాలు..

సుకన్య సమృద్ధి యోజన సహాయంతో, మీరు దీర్ఘకాలిక పెట్టుబడులలో చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు, దీని వల్ల  మీ చిన్న నెలవారీ పొదుపు పెద్ద మొత్తంగా మారుతుంది. ఈ పథకాన్ని కుమార్తె చదువుకు పెళ్లి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : కేవలం పిల్లులతో రూ.20 లక్షలు సంపాదించవచ్చా..! ఈ కొత్త బిజినెస్ ఏంటో తెలుసా..?
Recommended image2
Gold Price: రెండు రోజుల్లో భారీ పతనం...గ్రాము ఎంతంటే..?
Recommended image3
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved