స్టాక్ మార్కెట్ లాభాలకు మళ్లీ బ్రేక్‌లు.. నేడు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
నేడు రెండో ట్రేడింగ్ రోజు మంగళవారం స్టాక్ మార్కెట్(stockmarket) రెడ్ మార్క్ తో ప్రారంభమై ట్రేడింగ్ ముగిసే వరకు నష్టలోనే ట్రేడవుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్(sensex) 166.33 పాయింట్లు లేదా 0.29 శాతం క్షీణించి 58,117.09 వద్ద ముగిసింది. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(nifty) 43.35 పాయింట్లు లేదా 0.25 శాతం క్షీణించి 17,324.90 వద్ద ముగిసింది.

ఈ షేర్లలో క్షీణత
నేడు దాదాపు 1695 షేర్లు పెరిగాయి, 1462 షేర్లు క్షీణించాయి అలాగే 109 షేర్లు మారలేదు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్లుగా ఉండగా ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. పవర్, ఫార్మా మరియు ఆయిల్ & గ్యాస్ లాభాల్లో ముగియగా, ఆటో, ఎఫ్‌ఎంసిజి అండ్ పిఎస్‌యు బ్యాంక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
భారీ పతనంతో ఓపెన్
ఈ వారంలోని రెండవ ట్రేడింగ్ రోజున మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. బిఎస్‌ఈ 30-షేర్ల సెన్సెక్స్ 233.66 పాయింట్లు లేదా 0.38 శాతం క్షీణించి 58,059.76 వద్ద ప్రారంభం కాగా మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85.05 పాయింట్లు లేదా 0.49 శాతం క్షీణించి 17,283.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
సోమవారం 500 పాయింట్లకు పైగా బ్రేక్
గత చివరి ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఈ సెన్సెక్స్ 503.25 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 58,283.42 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 143.05 పాయింట్లు లేదా 0.82 పాయింట్లు నష్టపోయి 17,368.25 వద్ద ముగిసింది. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఎం అండ్ ఎం టాప్ లూజర్స్‌లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, విప్రో, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ల షేర్లు లాభాల్లో ఉన్నాయి. సెక్టార్లలో నిఫ్టీ ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం, బలహీన ఆసియా మార్కెట్ల కారణంగా యూఎస్ ఫెడ్ పాలసీ ప్రకటన కంటే ముందే దేశీయ సూచీలు నష్టాలను కొనసాగించాయి. అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ ఆఫ్‌సెట్ చేయడం, ఇంధనంపై లెవీలలో కోత, అధిక ఇన్‌పుట్ ఖర్చులు ధరలను పెంచడానికి ఉత్పత్తిదారులను బలవంతం చేయడంతో భారతదేశ సిపిఐ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.91% కి పెరిగింది. అంతేకాకుండా మినరల్ ఆయిల్, బేస్ మెటల్స్, క్రూడ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మూలంగా భారతదేశ టోకు ద్రవ్యోల్బణం 12 సంవత్సరాల గరిష్ట స్థాయి 14.23% సంవత్సరానికి పెరిగింది అని అన్నారు.