మీ ఫోన్ స్లో అయ్యిందా? వాట్సాప్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే స్పీడ్ అవుతుంది
మొబైల్ ఫోన్లు సడన్ గా స్పీడ్ తగ్గిపోతుంటాయి. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. అయితే వాట్సాప్ వల్ల మీ ఫోన్ స్లో అయ్యిందేమో తెలుసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. చిన్న సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మీ ఫోన్ మళ్లీ స్పీడ్ గా పనిచేసేలా చేయొచ్చు.
ఫోన్ లో యాప్స్ ఎక్కువైనా స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంది. టెంపరరీ ఫైల్స్ ఎక్కువైపోయినా ఇదే పరిస్థితి ఏర్పడవచ్చు. అనవసరమైన యాప్స్, చాలా కాలంగా ఉపయోగించనివి, ఇలా ఫోన్ స్లోగా పనిచేయడానికి ఎన్నో కారణాలుంటాయి. అదే విధంగా ఫోన్ స్లోగా పనిచేయడానికి WhatsApp కూడా ఒక కారణం కావచ్చు. వాట్సాప్ ఫోన్ స్పీడ్‌ని ఎలా తగ్గిస్తుంది అని అనుకుంటున్నారా? తెలుసుకుందాం రండి.
మొబైల్ ఉందంటే.. అందులో వాట్సాప్ లేకుండా ఉండదు. ఏ కంపెనీ మొబైల్ అయినా డీఫాల్ట్ గా వాట్సాప్ యాప్ ఉంటుంది. దీని వాడకం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో వాట్సాప్ అకౌంట్ లేని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ఏ కంపెనీ ఫోన్ అయినా వాట్సాప్ కి కేటాయించే స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా వాట్సాప్ కంటిన్యూగా వాడటం వల్ల స్టోరేజ్ నిండిపోయి ఫోన్ స్లో అయిపోతుంది.
వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘స్టోరేజ్ అండ్ డేటా’ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ యాప్ ఎంత స్టోరేజీని ఉపయోగిస్తుందో తెలుస్తుంది. అంతే కాకుండా ఏ చాట్ ఎంత స్టోరేజీని వాడుకుందో కూడా గమనించవచ్చు. అంటే మీ కాంటాక్ట్ లిస్టులో ఎవరితో ఎక్కువ డాటా షేర్ చేసుకున్నారో, ఎంత డాటా వినియోగించారో కూడా క్లియర్ గా గమనించవచ్చు.
1. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 చుక్కలపై క్లిక్ చేయండి.
2. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కనిపిస్తున్న ఆప్షన్స్ లో ‘స్టోరేజ్ అండ్ డేటా’ఓపెన్ చేయండి.
3. అందులో ‘మేనేజ్ స్టోరేజ్’పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీకు వాట్సాప్ ఎంత డాటా ఉపయోగించింది. ఎంత కెపాసిటీ ఉంది. వ్యక్తిగత చాట్‌లకు ఎంత డాటా వాడారు. ఇలాంటి అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి.
5. వీటిల్లో మీకు అవసరం లేని డేటాను డిలీట్ చేయండి. దీంతో స్టోరేజ్ ఫ్రీ అవ్వడం మొదలవుతుంది. దీని వల్ల ఫోన్ స్పీడ్ కూడా మెరుగవుతుంది.
ఇది కాకుండా వాట్సాప్ స్టోరేజ్ ఫుల్ అవడానికి మరో కారణం కూడా ఉంది. దాని పేరు ‘మీడియా విజిబిలిటీ’. ఈ ఫీచర్ మీ వాట్సాప్‌లో ఆన్‌లో ఉంటే వాట్సాప్‌లో వచ్చిన ప్రతి ఫోటో, వీడియో ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. దీంతో ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది.
1. దీన్ని ఆపాలంటే వాట్సాప్ లో ఒక్కో చాట్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న 3 చుక్కలను క్లిక్ చేయండి.
2. కనిపిస్తున్న ఆప్షన్స్ లో ‘వ్యూ కాంటాక్ట్’ గాని, ‘గ్రూప్ ఇన్ఫో’ అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అందులో ‘మీడియా విజిబులిటీ’పై క్లిక్ చేయండి.
4. ఈ ఫీచర్ ఆన్ లో ఉంటే వెంటనే ఆఫ్ చేయండి. దీంతో ఇకపై మీరు వాట్సాప్ కి వచ్చిన ఫోటోలు, వీడియోలు గ్యాలరీలో సేవ్ అవకుండా ఉంటాయి. మెమొరీ సేవ్ అవుతుంది. ఆటోమెటిక్ గా ఫోన్ కూడా స్పీడ్ గా పనిచేస్తుంది.