- Home
- Business
- Smart TV: రూ. 48 వేల స్మార్ట్ టీవీని రూ. 17500కే సొంతం చేసుకునే అవకాశం.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదండోయ్.
Smart TV: రూ. 48 వేల స్మార్ట్ టీవీని రూ. 17500కే సొంతం చేసుకునే అవకాశం.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదండోయ్.
Smart TV: స్మార్ట్ టీవీలపై ఈ కామర్స్ సైట్స్‌లో మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌లో ఇలాంటి ఒక బెస్ట డీల్ యూజర్లను ఆకట్టుకుంటోంది. రూ. 48 వేల స్మార్ట్ టీవీ కేవలం రూ. 17500కే లభిస్తోంది. ఈ డీల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం

ఏకంగా 60 శాతం డిస్కౌంట్
కంప్యూటర్ మానిటర్లకు పెట్టింది పేరైన ఏసర్ కంపెనీ స్మార్టీ టీవీలతోనూ యూజర్లను ఆకర్షిస్తోంది. అమెజాన్ లో ఏసర్ కంపెనీకి చెందిన 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.ఈ టీవీ అసలు ధర రూ. 47,999కాగా 60 శాతం డిస్కౌంట్‌తో రూ. 18,999కే లభిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇవన్నీ కలుపుకొని ఈ టీవీని సుమారు రూ. 17500కే సొంతం చేసుకోవచ్చు.
43 అంగుళాల 4K డిస్‌ప్లే – హై క్వాలిటీ వీక్షణ అనుభవం
ఈ ఏసర్ టీవీలో 43 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంటుంది. 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ వల్ల చిత్రాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో ఎక్కడి నుంచి చూసినా విజువల్స్ స్పష్టంగా ఉంటాయి. HDR10, HLG సపోర్ట్ వల్ల రంగులు సహజంగా కనిపిస్తాయి. అల్ట్రా బ్రైట్‌నెస్ ఫీచర్ వల్ల వెలుతురు ఎక్కువ ఉన్న గదుల్లో కూడా బాగా చూడొచ్చు.
గూగుల్ టీవీ – లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 సపోర్ట్
ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి యాప్‌లకు డైరెక్ట్ హాట్‌కీలు ఉంటాయి. వ్యక్తిగత ప్రొఫైల్, కిడ్స్ ప్రొఫైల్, కంటెంట్ సజెషన్స్ వంటి ఫీచర్లు కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడతాయి. గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ ద్వారా టీవీని నియంత్రించవచ్చు.
శక్తివంతమైన సౌండ్ – డాల్బీ అట్మాస్ సపోర్ట్
ఈ టీవీలో 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఉంది. డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో సపోర్ట్ వల్ల థియేటర్‌లాంటి సౌండ్ అనుభవం లభిస్తుంది. స్టాండర్డ్, మ్యూజిక్, స్పీచ్, స్టేడియం వంటి పలు సౌండ్ మోడ్‌లు ఉన్నాయి. సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, మ్యూజిక్ అన్నింటికీ మంచి ఆడియో క్వాలిటీ అందుతుంది.
కనెక్టివిటీ, వారంటీ వివరాలు
ఈ ఏసర్ స్మార్ట్ టీవీలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ సపోర్ట్ ఉంది. మూడు HDMI 2.1 పోర్టులు, రెండు USB పోర్టులు ఉన్నాయి. గేమింగ్ కన్సోల్, ల్యాప్‌టాప్, సెటాప్ బాక్స్ సులువుగా కనెక్ట్ చేయొచ్చు. వీడియో కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఒక సంవత్సరం పూర్తి వారంటీ, రిమోట్‌పై ఆరు నెలల వారంటీ లభిస్తుంది. వాల్ మౌంట్ బాక్స్‌లోనే వస్తుంది.

