స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ 5 ఫీచర్స్ ఉంటే అదే బెస్ట్ టీవీ
స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే దొరుకుతున్నాయని ఏది పడితే అది కొంటే తర్వగా పాడైపోతాయి. మరి మంచి స్మార్ట్ టీవీ కొనాలంటే ఎలాంటి విషయాలు పరిశీలించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఏ టీవీ అయినా రూ.10 వేలకంటే తక్కువకు దొరకదు. ఇంత తక్కువకు టీవీ లభిస్తోందంటే అందులో ఉండే ఫీచర్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు గాని స్మార్ట్ టీవీ కొనాలనుకొని గూగుల్ లో సెర్చ్ చేస్తే చాలు. టీవీ కంపెనీలు తమ ఆఫర్లతో మీ ముందు వాలిపోతాయి. ఒకదాని తర్వాత మరొకటి అలాంటి వీడియోలు, యాడ్స్ మీకు కనిపిస్తాయి. వాటిల్లో తక్కువ ధరకు దొరుకుతుందని డీటైల్స్ చూడకుండా కొంటే అది త్వరగా పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల టీవీ కొనే ముందు ఎలాంటి విషయాలు పూర్తిగా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ షాపుల్లో డిస్కౌంట్లు బాగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు లాంటివి తక్కువ ధరకే దొరుకుతున్నాయి. బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు కూడా రూ.10,000 లోపే దొరుకుతున్నాయి.
32 ఇంచ్ నుండి 65 ఇంచ్ స్మార్ట్ టీవీలను కూడా మీరు కావాలంటే రూ.10 వేల లోపే కొనొచ్చు. కానీ వీటిలో కొన్ని మాత్రమే మంచివి ఉంటాయి. చాలా టీవీలు కొన్న కొద్ది రోజుల్లోనే పాడై పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డిస్‌ప్లే, ప్రసారం, సౌండ్ ఇలా చాలా ఫీచర్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
డిస్కౌంట్లు బాగా ఇస్తున్నారని, టీవీల ఫీచర్లు చూసుకోకుండా కొంటే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మార్ట్ టీవీ కొనేటప్పుడు కచ్చితంగా ఈ అంశాలు చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు.
డిస్‌ప్లే ప్యానెల్: స్మార్ట్ టీవీకి డిస్‌ప్లే ప్రాణం లాంటిది. డిస్‌ప్లే బాగుంటేనే క్వాలిటీ, క్లారిటీ బాగుంటాయి. మీరు కొనే టీవీలో LCD, TFT, AMOLED, OLED, IPS లేదా QLED ప్యానెల్ ఉండేలా చూసుకోండి. 4K లేదా అల్ట్రా HD క్వాలిటీ ఉండాలి.
సౌండ్ సిస్టమ్: మంచి సౌండ్ ఉంటేనే పాటలు, సినిమాలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందువల్ల కనీసం 30 W సౌండ్ ఔట్‌పుట్ ఉండే టీవీని ప్రిఫర్ చేయండి.
కనెక్టివిటీ ఆప్షన్లు: చాలా స్మార్ట్ టీవీలు USB డివైస్‌లపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి 2-3 HDMI, USB పోర్టులు ఉండేలా చూసుకోండి.
RAM & స్టోరేజ్: ఎక్కువ RAM, స్టోరేజ్ ఉంటే టీవీ బాగా పనిచేస్తుంది. కనీసం 32 GB స్టోరేజ్ ఉన్న టీవీని ఎంచుకోండి.
వారంటీ & అప్‌డేట్స్: టీవీ కొనే ముందు వారంటీ ఎంత ఉందో చెక్ చేసుకోండి. లేటెస్ట్ అప్‌డేట్స్ ఉన్న టీవీలను కొనడం మంచిది.
ఈ అంశాలను చూసి కొంటే మీకు మంచి టీవీ దొరుకుతుంది. డబ్బు ఆదా అవుతుంది.
స్మార్ట్ వాచీ కావాలా? Flipkartలో డిస్కౌంట్ ఆఫర్లు చూస్తే ఆశ్చర్యపోతారు