స్పామ్ కాల్స్, మెసేజస్ బ్లాక్ చేయాలా? ఇదిగో సింపుల్ ట్రిక్
మీకు పర్సనల్ లోన్ ఇస్తామని కాల్స్ చేస్తున్నారా? క్రెడిట్ కార్డు తీసుకుంటారా అని అడుగుతున్నారా? ఇలాంటి అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజ్ ల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా? వీటిని బ్లాక్ చేసి పడేద్దామని మీరు అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు ప్రతి రోజూ ఎన్నో ఫోన్ కాల్స్, మెసేజస్ చేసి లోన్స్ ఇస్తామని, క్రెడిట్ కార్డు తీసుకోండని అడుగుతుంటారు కదా. ఈ సమస్య ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. అవసరం లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఫోన్ కాల్స్, మెసేజస్ వస్తూనే ఉంటాయి కదా. చివరికి ఆ కస్టమర్ కేర్ సిబ్బందిపై కోప్పడితే తప్ప ఇలాంటి కాల్స్, మెసేజస్ ఆగవు.
ఆ స్పామ్ కాల్స్, మెసేజస్ తాకిడి తట్టుకోలేక బ్యాంకులకు, ఆ ఫైనాన్స్ కంపెనీలకు కంప్లయింట్ ఇచ్చామనుకోండి. కొన్ని రోజులు కాల్స్, మెసేజస్ ఆగిపోతాయి. కాని కొన్నాళ్లకి మళ్లీ యధావిధిగా అన్నీ మొదలైపోతాయి. మనలో చాలా మంది ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు కదా. ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే మీరు స్పామ్ కాల్స్, మెసేజస్ ని బ్లాక్ చేయడమే మార్గం.
స్పామ్ కాల్స్, మెసేజస్ ని బ్లాక్ చేయడానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. అది ఫాలో అయితే 24 గంటల్లో మీకు కాల్స్, మెసేజస్ ఆగిపోతాయి. ఆ విధానం ఏంటో తెలుసుకుందాం రండి.
స్పామ్ కాల్స్, మెసేజస్ ని బ్లాక్ చేయాలంటే మీ రిజస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1909కి ‘FULLY BLOCK’ అని మెసేజ్ చేయండి. ఇది పంపిన 24 గంటల్లో మీకు స్పామ్ కాల్స్, మెసేజస్ బ్లాక్ చేస్తున్నట్లుగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన 24 గంటల్లో మీకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ప్రకటనలకు సంబంధించిన అన్ని కాల్స్, మెసేజ్ లు రావడం ఆగిపోతాయి.
ఇదే కాకుండా మరికొన్ని విధాలుగా స్పామ్ కాల్స్, మెసేజస్ ను బ్లాక్ చేయొచ్చు.
కాల్ లాగ్ ఓపెన్ చేసి, మీకు తరచూ వస్తున్న స్పామ్ కాల్ నంబర్ పై లాంగ్ ప్రెస్ చేయండి. Block/Report Spam అనే ఆప్షన్ ఎంచుకోండి. దీంతో ఆ నంబర్ ఒకటే బ్లాక్ లిస్ట్ లోకి చేరిపోతుంది. ఇకపై ఆ నంబరు నుంచి కాల్స్ రాకుండా ఉంటాయి.
ఒక వేళ మీరు స్పామ్ మెసేజస్ బ్లాక్ చేయాలనుకుంటే మీ ఫోన్ నంబరుకు వచ్చిన స్పామ్ మెసేజ్ పై క్లిక్ చేయండి. ఆ మెసేజ్ ని హోల్డ్ చేసి పట్టుకుంటే పక్కన మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేస్తే బ్లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే స్పామ్ మెసేజస్ ఆగిపోతాయి.
True caller వంటి యాప్స్ ఉపయోగించడం ద్వారా సులభంగా స్పామ్ కాల్స్, మెసేజెస్ ను గుర్తించి బ్లాక్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి తెలియని నంబరు నుంచి మిస్డ్ కాల్ వస్తే కాల్ బ్యాక్ చేయకండి: ఇదో పెద్ద స్కామ్