- Home
- Business
- Silver Price: ఆ రోజు ఫోన్ కొనే బదలు వెండి కొనుంటే.. ఈరోజు మీ దగ్గర రూ. 4 లక్షలు ఉండేవి
Silver Price: ఆ రోజు ఫోన్ కొనే బదలు వెండి కొనుంటే.. ఈరోజు మీ దగ్గర రూ. 4 లక్షలు ఉండేవి
Silver Price: వెండి బంగారమవుతోంది. సిల్వర్‌పై ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఏడాది తిరిగేలోపు లక్షాధికారులయ్యారు. గతేడాది విడుదలైన ఐఫోన్17 కొనే బదులు వెండి కొనుంటే, ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉండేదో తెలుసా.?

ఐఫోన్ 17 లాంచింగ్ రోజు వెండి ధర ఎంతంటే
ఆపిల్ సంస్థ ఐఫోన్ 17 ఫోన్‌ను 2025 సెప్టెంబర్ 19న విడుదల చేసింది. ఆ లాంచ్ సమయంలో భారతదేశంలో ధర రూ. రూ. 1,34,900 గా ప్రకటించారు. యాపిల్ నుంచి కొత్త ఫోన్ రాగానే ఎగబడే టెక్ లవర్స్ పెద్ద ఎత్తున ఫోన్‌ను కొనుగోలు చేశారు. అయితే ఆ లాంచ్ సమయంలో కిలో వెండి ధర కూడా సుమారు రూ. 1,30,000 గా ఉంది. అంటే ఆ రోజు ఫోన్ బదులు వెండి కొనుంటే కిలో వచ్చేది.
ధరల పెరుగుదలలో పోలిక
ఐఫోన్ 17 ధర లాంచింగ్ సమయంలో రూ. 1,34,900గా ఉంటే కిలో వెండి ధర రూ. 1,30,000గా ఉంది. అయితే ప్రస్తుతం కిలో వెండి ధర ఏకంగా రూ. 3,80,000కి చేరింది. అంటే ఏడాదిలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. కానీ అప్పుడు కొన్న ఐఫోన్ 17ని ఈరోజు విక్రయిస్తే రూ. 80 వేలు కూడా రావు.
ఇంతకీ పోలిక సరైందేనా.?
ఐఫోన్17తో సిల్వర్‌తో పోల్చడం సరైందేనా అంటే టెక్ లవర్స్ పెదవి విరిచే అవకాశం ఉంది. జీవితంలో మంచి ఫోన్ వాడడం, మంచి దుస్తులు ధరించడం అనేది స్టేటస్ సింబల్‌గా భావిస్తోన్న రోజులివీ. అలాంటి తరుణంలో డబ్బులన్నీ పెట్టుబడి రూపంలోనే పెడితే ఇక జీవితాన్ని ఏం ఆస్వాదిస్తామం అనే వారు కూడా ఉంటారు. అందుకే ఈ అభిప్రాయాలు ఆయా వ్యక్తుల ఆలోచనను బట్టి మారుతాయి.
వెండి ధర ఎందుకు పెరుగుతోంది.?
* వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం దీని వినియోగం పెరగడమే. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ రంగాల్లో వెండి ఎక్కువగా ఉపయోగపడుతుంది.
* మనీ మార్కెట్లో అస్థిరత ఉంటే, వెండి, బంగారం వంటి మెటల్స్‌పై ఆసక్తి చూపిస్తారు. ఇది కూడా వెండి ధర పెరగడానికి కారణంగా చెప్పొచ్చు.
వెండి ధరలు ఇంకా పెరగనున్నాయా.?
ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం, వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని అంచనాల ప్రకారం వచ్చే కొంతకాలంలోనే వెండి ధర రూ. 4 లక్షలు దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏడాది చివరి నాటికి కిలో వెండి ధర రూ.4.6 లక్షలు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.

