- Home
- Business
- షారుఖ్ ఖాన్ మేనేజర్‌కు ఇచ్చే జీతంతో రోల్స్ రాయిస్ కారు, సల్మాన్ బాడీగార్డుకు ఇచ్చే జీతంతో ఆడీకారు కొనొచ్చట..
షారుఖ్ ఖాన్ మేనేజర్‌కు ఇచ్చే జీతంతో రోల్స్ రాయిస్ కారు, సల్మాన్ బాడీగార్డుకు ఇచ్చే జీతంతో ఆడీకారు కొనొచ్చట..
బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు.. అని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ సినిమాలో పాట రాశారు అప్పట్లో చాలామంది నిరుద్యోగులు ఈ పాట పాడుకుంటూ ఉండేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది కొత్త కొత్త రంగాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు వెలుగులోకి వస్తున్నాయి.

బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు.. అని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ సినిమాలో పాట రాశారు అప్పట్లో చాలామంది నిరుద్యోగులు ఈ పాట పాడుకుంటూ ఉండేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది కొత్త కొత్త రంగాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు వెలుగులోకి వస్తున్నాయి.
బాలీవుడ్ లో గడచిన మూడు దశాబ్దాలుగా సూపర్ స్టార్ కిరీటాన్ని అందుకొని బాలీవుడ్ బాద్షాగా పేరుందిన షారుక్ ఖాన్ తన బాడీగార్డ్ రవి సింగ్ కు సుమారు ఏటా రెండున్నర కోట్లు వేతనం చెల్లిస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేతనంతో పాటు అతనికి ఇతర అలవెన్సులు సైతం ఉంటాయి. అలాగే షారుక్ ఖాన్ తన మేనేజర్ పూజా దడ్లాని సుమారు 7 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ఏటా వేతనం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే ఆమెకు ఇటీవలే ముంబైలోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్ సైతం కొనిచ్చినట్లు తెలిసింది.
షారుఖ్ ఖాన్ తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బాడీగార్డుకు సుమారు రెండు కోట్ల రూపాయల జీతాన్ని ప్రతి ఏటా చెల్లిస్తున్నట్లు తెలిసింది. దాంతోపాటు అతడికి ఇతర అలవెన్సులు సైతం చెల్లిస్తున్నారు. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ పేరు షేరా అతను సల్మాన్ ఖాన్ వద్దే గడచిన 20 సంవత్సరాలుగా బాడీగార్డ్ గా సేవలు అందిస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ తర్వాత మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సైతం తన బాడీగార్డ్ యువరాజ్ గోర్పడేకు ఏటా రెండు కోట్ల రూపాయలు వేతనంగా చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది దీంతోపాటు అతనికి ఇతర అలవెన్సులు సైతం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అన్న అమితాబచ్చన్ తన బాడీగార్డ్ కు సాలీనా 1.5 కోట్ల వేతనం చెల్లిస్తున్నారు. అలాగే మరో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ శ్రేయస్ కు 1.2 కోట్ల వేతనం చెల్లిస్తున్నారు.
ఇక బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ తన కుమారుడు తైమూర్ ను చూసుకునేందుకు ఏర్పాటుచేసిన బేబీ సిట్టర్ కు ప్రతి నెల లక్షన్నర రూపాయలు చెల్లిస్తున్నారని తెలుస్తోంది అలాగే ఓవర్ టైం చేసినందుకు గాను ఆమెకు ప్రతినెల 1.75 లక్షలు అదనంగా సైతం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేతనాలతో పాటు వీరికి అదనంగా అనేక అలవెన్సులు కూడా చెల్లించాల్సి ఉంటుంది.