స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏంటి.. వాటి మధ్య తేడా ఏమిటో తెలుసుకోండి..
మనం సాధారణంగా స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ గురించి వింటుంటం.. అయితే సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏంటి, వాటి మధ్య ఉండే తేడా గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? టీవీ, వార్తాపత్రిక లేదా మరేదైనా చోట సెన్సెక్స్, నిఫ్టీ పతనం లేదా లాభాలు కావడం చూస్తుంటాం...

అలాగే టీవీ చానెళ్లలో, వార్తాపత్రికల్లో ప్రతిరోజూ వాటి ఎత్తుపల్లాల గురించి చాలా చర్చలు జరుగుతుంటాయి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏమిటో మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా.. ? అయితే వాటి గురించి వివరంగా మీకోసం..
సెన్సెక్స్
సెన్సెక్స్ అనేది బిఎస్‌ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్. దేశంలోని 30 అతిపెద్ద కంపెనీలు సెన్సెక్స్ ఇండెక్స్‌లో మార్కెట్ క్యాప్ ఆధారంగా ఇండెక్స్ చేయబడుతుంది. ప్రస్తుతం ఇందులో రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం నేడు సెన్సెక్స్ 259పాయింట్లు కోల్పోయి 58,531.99 వద్ద ట్రేడవుతుంది.
సెన్సెక్స్ ని 1 జనవరి 1986న ప్రారంభించారు. ఇందులో మొత్తం 30 కంపెనీలు ఉన్నాయి. ఈ కారణంగా దీనిని BSE30 అని కూడా పిలుస్తారు. దేశంలోని పెద్ద కంపెనీలు, స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందో సెన్సెక్స్ హెచ్చుతగ్గులు తెలియజేస్తాయి.
నిఫ్టీ
నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పరిధిలోకి వస్తుంది. నిఫ్టీలో దేశంలోని మొత్తం 50 కంపెనీలు ఇండెక్స్‌లో ఉంటాయి. అయితే దేశంలోని 12 విభిన్న రంగాల నుంచి ఈ కంపెనీలను ఎంపిక చేస్తారు. నిఫ్టీ అనే పదం నేషనల్ అండ్ 50తో రూపొందించారు. నిఫ్టీని నిఫ్టీ50 అని కూడా అంటారు. దీనిని 21 ఏప్రిల్ 1997 సంవత్సరంలో ప్రారంభించారు. నిఫ్టీలో ఉన్న అస్థిరత దాని ట్రెండ్ ఏ దిశలో వెళుతుందో స్టాక్ మార్కెట్ గురించి ఒక ఆలోచన ఇస్తుంది. నేడు నిఫ్టీ 78 పాయింట్లు పడిపోయి 17,431.70 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది.
సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మధ్య తేడా ?
సెన్సెక్స్ అనేది బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ పరిధిలోకి వస్తుంది. అయితే నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్. సెన్సెక్స్‌లో 30 కంపెనీల ఇండెక్స్‌లు ఉంటాయి. అలాగే నిఫ్టీలో మొత్తం 50 కంపెనీలు ఉంటాయి. సెన్సెక్స్ బేస్ వాల్యు 100, కాగా నిఫ్టీ బేస్ వాల్యు 1000.