MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇండియాలోని ఆ నగరంలో చాట్ అమ్మితే చాలు రూ.లక్షల్లో సంపాదన

ఇండియాలోని ఆ నగరంలో చాట్ అమ్మితే చాలు రూ.లక్షల్లో సంపాదన

ఇండియాలోని ఆ నగరంలో వ్యాపారులు రోజుకు రూ. లక్షల్లో సంపాదిస్తారు. అంత సంపాదిస్తున్నారని వారంతా పెద్ద బిజినెస్ లు చేస్తున్నారని అనుకుంటే మీరు చాట్ లో కాలేసినట్టే. ఎందుకంటే వారంతా చాట్(బఠానీ) అమ్మే చిరు వ్యాపారులు. వారిలో కొందరి సంపాదన రోజుకు రూ. లక్షల్లో ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. మరి ఆ వీధి వ్యాపారుల బిజినెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 12 2024, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సాధారణంగా ఒక మనిషి సంపాదన రోజుకు 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. జాబ్ చేసే వాళ్లయినా, చిరు వ్యాపారాలు చేసే వారికైనా సుమారుగా ఇంతే ఉంటుంది. జాబ్స్ లో పెద్ద పొజిషన్ లో ఉన్న వారైతే నెలకు రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పైగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాని మన దేశ రాజధాని ఢిల్లీలో కేవలం చాట్ అమ్ముతూ రోజుకు రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా సంపాదించే వారు ఉన్నారు. అలా అని వారంతా పెద్ద పెద్ద హోటల్స్ నిర్వహిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారని అనుకోవద్దు. వీధుల్లోనే రోడ్డు పక్కన చిన్న బడ్డీలు, బండ్లు పెట్టుకొని  చాట్ అమ్ముతుంటారు. ఢిల్లీలో చాట్ విక్రయించే చిరు వ్యాపారులు సుమారు 70 వేల కు పైగా ఉన్నారని ఓ సర్వే నివేదికలో ఉంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అలాంటి వ్యాపారుల్లో సియా రామ్ ఒకరు. ఆయన ఢిల్లీలో ఘుగ్ని, ఛోలే కుల్చా(చాట్ బఠాని, జొన్నరొట్టెలు) అమ్మి రోజుకు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నానని చెబుతున్నారు. ఆయన ఈ వ్యాపారాన్ని 60 ఏళ్లుగా చేస్తున్నారట. అందువల్ల ఆయన ఢిల్లీ లో చాలా ఫేమస్ వ్యక్తిగా మారిపోయారు. ఢిల్లీలో ఉండేవారు కాని, అక్కడికి పనులపై వచ్చిన వారు కాని కచ్చితంగా సియా రామ్ దగ్గరకు వచ్చి ఘుగ్ని తినేసి వెళతారు. అంతలా ఆయన ఫేమస్ అయ్యారు. 
 

34

ఆయన విజయ రహస్యం తెలుసుకుంటే బిజినెస్ చేయాలని ఆసక్తి ఉన్న ఉద్యోగులు జాబ్స్ వదిలేసి అర్జెంట్ గా వ్యాపారంలోకి దిగిపోదాం అనుకుంటారు. సియా రామ్ లాంటి వీధి వ్యాపారులు ఢిల్లీలో వీధికి ఒకరుంటారు. అయితే ఎవరి వ్యాపారం వారిదే. లోకల్ గా ఉండే ప్రజలు ఇప్పటికే వారికి రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు. సియా రామ్ ప్రత్యేకత ఏంటంటే చాట్ తయారీలో నాణ్యత, రుచిని మెయింటెయిన్ చేస్తారు. అందుకే  కస్టమర్లు ఆయన వద్దకే వెళ్లి చాట్ తింటారు. సెంట్రల్ మార్కెట్‌లో బట్టల దుకాణాల పక్కన రోడ్డు పైనే ఆయన ఛోలే కుల్చా దుకాణం నిర్వహిస్తుండటం విశేషం. ప్రతిరోజూ ఆలీగఢ్ నుండి ఢిల్లీకి వచ్చి ఆయన ఈ వ్యాపారం చేస్తుంటారు. 
 

44

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఇంకా పెద్ద ఉద్యోగ్యాలు చేసేవాళ్ళు తప్ప రూ.లక్షల్లో సంపాదించడం కష్టం. మరి ఢిల్లీలో వీధి వ్యాపారులు కేవలం చాట్ అమ్మి రూ.లక్షల్లో సంపాదిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved