ఏ బ్యాంకులో FD చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో తెలుసా?
మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నారా? SBI, HDFC, ICICI తదితర బ్యాంకులు ఎఫ్‌డీలకు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ బ్యాంకులు పోటీపడి మరి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ఏ బ్యాంకులో ఎంత కాలపరిమితితో చేస్తే లాభదాయక ఆదాయం వస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం అంటే డబ్బుకు భద్రతను అందించే నమ్మకమైన పెట్టుబడి మార్గం. ఇది ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ రాబడిని అందించే బ్యాంకును ఎంచుకోవడం చాలా ముఖ్యం. SBI, HDFC, ICICI బ్యాంకులు పోటీగా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కాబట్టి ఎఫ్‌డీ చేయాలనుకున్న వారు ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం మంచిది.
ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి మార్గం. ఇది మీకు భవిష్యత్తులో సరైన సమయంలో ఉపయోగపడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం మీ కష్టానికి ప్రతిఫలం. ఇది మీరు ఎటువంటి కష్టం పడకుండా పెరిగే ఆదాయ మార్గం. కాస్త డబ్బులున్నప్పుడు మంచి వడ్డీ ఇచ్చే బ్యాంకు గురించి తెలుసుకొని పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన. ఏ బ్యాంకు అయినా ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక వడ్డీ రేట్లు అందిస్తాయి. వీటిల్లోనూ ఎక్కువ కాలపరిమితి ఉన్న వాటికి మరింత లాభం వచ్చేలా ప్లాన్స్ ఇస్తుంటాయి. పెట్టుబడి పెట్టాలనుకున్నవారు సరైన బ్యాంకును ఎంచుకోవడమే మీరు చేయాల్సిన పని. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు లాభదాయకమైన వడ్డీరేట్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మరింత ఉపయోగపడేలా ఎఫ్‌డీ స్కీమ్‌లు అందిస్తున్నాయి. మీరు కనుక సీనియర్ సిటిజన్లు అయి ఉంటే ఈ మూడు బ్యాంకులు ఇస్తున్న ఎఫ్‌డీ స్కీమ్‌ల గురించి తెలుసుకొని పెట్టుబడి పెట్టండి.
బ్యాంక్, డిపాజిట్ చేయాలనుకున్న మొత్తం, ఇన్వెస్ట్ మెంట్ టైమ్ ను బట్టి ఫిక్స్డ్ డిపాజిట్ పథకానికి అందించే వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. పెట్టుబడిదారులు తెలివితేటలతో సరైన బ్యాంకును ఎంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం.
సాధారణ, సీనియర్ సిటిజన్లకు భారత స్టేట్ బ్యాంక్ (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌లలో మూడు సంవత్సరాలకు రూ.3,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలకు 6.75% వడ్డీ రేటు అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. దీన్ని బట్టి సాధారణ ప్రజలు రూ.3,00,000 అమౌంట్ ను మూడు సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే రూ.3,66,718 మెచ్యూరిటీ మొత్తం వస్తుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు అయితే 3 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తంగా రూ.3,72,164 వస్తుంది.
సాధారణ ప్రజలు HDFC బ్యాంక్‌లో మూడు సంవత్సరాలకు రూ.3,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ గా పెట్టుబడి పెడితే 7.00% వడ్డీ రేటు ఇస్తారు. అదే సీనియర్ సిటిజన్లు 3 సంవత్సరాలకు రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే 7.50% వడ్డీ రేటు లభిస్తుంది. ఆ లెక్కన సాధారణ ప్రజలు 3 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తంగా రూ.3,69,432 పొందుతారు. అదే సీనియర్ సిటిజన్ల అయితే ఇదే పెట్టుబడికి రూ.3,74,915 పొందవచ్చు.
ICICI బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో HDFC బ్యాంక్‌నే ఫాలో అవుతోంది. జనరల్ పబ్లిక్ ICICI బ్యాంక్ లో 3 సంవత్సరాలకు రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే 7.00% వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 7.50% వడ్డీ ఇస్తారు. ఆ లెక్కన సాధారణ ప్రజలు 3 సంవత్సరాల తర్వాత రూ.3,69,432 సంపాదించవచ్చు. సీనియర్ సిటిజన్లకు రూ.3,74,915 మెచ్యూరిటీ మొత్తంగా లభిస్తుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్బీఐ, ప్రైవేటు బ్యాంకులైన ICICI, HDFC బ్యాంకులు ఇస్తున్న వడ్డీరేట్లు, రిటర్న్స్ గమనించుకొని, మీకు నమ్మకమైన బ్యాంకులో పెట్టుబడి పెట్టి సురక్షితమైన, సులభమైన ఆదాయాన్ని పొందండి.