MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఈ బ్యాంక్ ప్రతినెల ఇంట్లో కూర్చొని రూ.60వేల వరకు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది.. ఎలా అంటే ?

ఈ బ్యాంక్ ప్రతినెల ఇంట్లో కూర్చొని రూ.60వేల వరకు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది.. ఎలా అంటే ?

దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(omicron) కేసులు పెరగడం ప్రారంభించాయి. దీంతో ప్రజల ఉద్యోగాలు(jobs), ఉపాధి(employment)కి మరోసారి ముప్పు పొంచి ఉన్నట్లు సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఇంట్లో కూర్చొని ప్రతి నెల వేల రూపాయలు సంపాదించే అవకాశం మీకు లభిస్తే ఎలా ఉంటుంది... మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 12 2022, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మీకు ఇంటి నుండే సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.  ఎలా అంటే.. మీరు ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం (SBI ATM)ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా ప్రతి నెల పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు ఇంకా దీని కోసం మీరు పెద్దగా చేయవలసిన అవసరం లేదు. అతిపెద్ద విషయం ఏమిటంటే ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి. కాబట్టి  ఈ గొప్ప వ్యాపార ఆలోచన మీకోసం.. దీని ద్వారా మీరు ఇంట్లో కూర్చొని పది కాదు ఇరవై కాదు, ఏకంగా నెలకు రూ.60 వేల వరకు సులభంగా సంపాదించవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఏ షరతులపై  ఫ్రాంచైజీ లభిస్తుంది ?
1. ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం ఫ్రాంచైజీని తీసుకోవడానికి మీకు 50-80 చదరపు అడుగుల స్థలం ఉండాలి అలాగే ఈ స్థలం ఏదైనా ఇతర ఏ‌టి‌ఎం నుండి 100 మీటర్ల దూరంలో ఉండాలి. 
2. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి. అంతే కాకుండా, 1 kW విద్యుత్ కనెక్షన్ కూడా తప్పనిసరి. ఇంకా ఈ స్థలం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండాలి. 
3. అలాగే, ఈ ఏ‌టి‌ఎం రోజుకు దాదాపు 300 లావాదేవీల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. 
 

35

 ఏ‌టి‌ఎం ఫ్రాంచైజీకి అవసరమైన డాక్యుమెంట్స్ 
ఐ‌డి ప్రూఫ్- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్
అడ్రస్ ప్రూఫ్- రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు
బ్యాంక్ ఖాతా ఇంకా పాస్‌బుక్
ఫోటోగ్రాఫ్, ఈ-మెయిల్ ఐ‌డి, ఫోన్ నంబర్
జి‌ఎస్‌టి నంబర్ 
ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ 

45

ఏ‌టి‌ఎం ఫ్రాంచైజీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి 
మీరు  ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం ఫ్రాంచైజీని తీసుకోవాలనుకుంటే ముందుగా ఏ బ్యాంక్ ఏ‌టి‌ఎం అయినా బ్యాంక్ ద్వారా ఇన్‌స్టాల్ చేయబడదని తెలుసుకోండి, కానీ ఇందుకోసం ఒక ప్రత్యేక సంస్థ ఉంది. వీరికి బ్యాంకు ద్వారా కాంట్రాక్టు ఇవ్వబడుతుంది, ఇది వివిధ ప్రదేశాలలో ఏ‌టి‌ఎంలను వ్యవస్థాపించడానికి పని చేస్తుంది. టాటా ఇండిక్యాష్, ముత్తూట్ ఏ‌టి‌ఎం, ఇండియా వన్ ఏ‌టి‌ఎం భారతదేశంలో ప్రధానంగా ఏ‌టి‌ఎంలను ఇన్‌స్టాల్ చేయడానికి ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి. మీరు ఈ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

55

కంపెనీ అధికారిక వెబ్‌సైట్
ఇండియా వన్ ఏ‌టి‌ఎం – india1atm.in/rent-your-space
టాటా ఇండిక్యాష్ - www.indicash.co.in
ముత్తూట్ ఏ‌టి‌ఎం– www.muthootatm.com/suggest-atm.html

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Fact Check: ఎస్‌బీఐ పీఎన్‌బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
Recommended image2
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
Recommended image3
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved