MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Visa: ఒక్క క్లిక్‌తో ఎడారి దేశం ట్రిప్.. టూరిస్టులకు సౌదీ ప్యాకేజీ వీసా

Visa: ఒక్క క్లిక్‌తో ఎడారి దేశం ట్రిప్.. టూరిస్టులకు సౌదీ ప్యాకేజీ వీసా

Saudi Visa: సౌదీ ట్రిప్ వేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. టూరిస్టులకు ప్రయాణం ఈజీ చేసేందుకు ఆ ప్రభుత్వం ప్యాకేజీ వీసా విధానం తీసుకొచ్చింది. దీనివల్ల వీసా, టికెట్లు, హోటల్ బుకింగ్, ట్రావెల్ సేవలన్నింటిని ఒకేసారి బుక్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 16 2026, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
టూరిస్టులకు గుడ్ న్యూస్
Image Credit : Asianet News

టూరిస్టులకు గుడ్ న్యూస్

సౌదీ అరేబియా ప్రభుత్వం టూరిస్టుల కోసం కొత్త 'ప్యాకేజీ వీసా' విధానం తీసుకొచ్చింది. టూరిస్ట్ వీసా దరఖాస్తు, ప్రయాణ బుకింగ్‌లను ఒకే సిస్టమ్ ద్వారా పూర్తి చేసే డిజిటల్ ప్రాజెక్ట్ ఇది. వీసా, ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్ వేర్వేరుగా బుక్ చేయాల్సిన పనిలేకుండా చేయడమే ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
తొలి దశలో ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే
Image Credit : Getty

తొలి దశలో ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే

ఈ ప్యాకేజీ వీసా విధానాన్ని ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలోనే ప్రారంభించారు. గుర్తింపు పొందిన ట్రావెల్, టూరిజం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా తొలి దశ సేవలు అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని దేశాలకు ఈ పథకాన్ని విస్తరించాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
38
టూరిజం డెవలప్ మెంట్ చేయడమే ముఖ్య ఉద్దేశం
Image Credit : PR

టూరిజం డెవలప్ మెంట్ చేయడమే ముఖ్య ఉద్దేశం

సౌదీ అరేబియా తన టూరిజం డెవలప్ చేసేందుకు చేపట్టిన ప్రణాళికల్లో ఈ కొత్త వీసా విధానం కూడా ఒకటి. గతంలో ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్, స్టాప్‌ఓవర్ ట్రాన్సిట్ వీసా వంటి సౌకర్యాలను ప్రవేశపెట్టింది. వీటి ఫలితంగా 2025 నాటికి 2.9 కోట్ల మంది విదేశీ సందర్శకులు సౌదీకి వస్తారని అంచనా వేశారు.

48
ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తామన్న మంత్రి
Image Credit : Getty

ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తామన్న మంత్రి

ఈ పథకంపై సౌదీ పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ స్పందించారు. సౌదీకి వచ్చే సందర్శకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వీసా జారీని ప్రయాణ బుకింగ్‌తో అనుసంధానించడం ద్వారా సందర్శకుల ప్రయాణ ప్రక్రియ సులభం అవుతుందని, పర్యాటక రంగంలోని వివిధ సేవలను మరింత సమన్వయం చేయవచ్చని మంత్రి తెలిపారు.
58
ప్రయాణికులకు లభించే ప్రధాన సౌకర్యాలు
Image Credit : Getty

ప్రయాణికులకు లభించే ప్రధాన సౌకర్యాలు

ఈ ప్యాకేజీ వీసాతో ప్రయాణికులు ఫ్లైట్ టికెట్, హోటల్ వసతి, వీసా దరఖాస్తును ఒకే ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా, సౌదీలోని పర్యాటక కేంద్రాలను సందర్శించడం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడి అనుభవాలను ఆస్వాదించడం వంటి సౌకర్యాలను కూడా ఈ ప్యాకేజీలో చేర్చుకోవచ్చు.

68
బుకింగ్ నుంచి ప్రయాణం వరకు ఒకే వ్యవస్థ
Image Credit : ANI

బుకింగ్ నుంచి ప్రయాణం వరకు ఒకే వ్యవస్థ

ప్రయాణాన్ని ప్లానింగ్ నుంచి సౌదీలో అడుగుపెట్టే వరకు, ప్రయాణికులకు బెస్ట్ మెమోరీస్ ను అందించడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యం. వేర్వేరు సేవల కోసం అనేక ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దాని వల్ల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.

78
గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే సేవలు
Image Credit : Getty

గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే సేవలు

ఈ ప్యాకేజీ వీసా అన్ని ట్రావెల్ ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉండదు. నిర్దిష్ట ప్రమాణాలను పాటించే గుర్తింపు పొందిన ట్రావెల్, టూరిజం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే ఈ సదుపాయం కల్పించారు. సందర్శకులకు ఉత్తమ సేవను అందించడానికి, 24 గంటల కస్టమర్ సపోర్ట్ ఇచ్చే సంస్థలనే ఈ పథకంలో చేర్చారు.

88
ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారేందుకు సౌదీ అడుగులు
Image Credit : Getty

ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారేందుకు సౌదీ అడుగులు

పర్యాటక రంగంలో పెద్దపీట వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సౌదీ అరేబియా, ఈ ప్యాకేజీ వీసాతో మరో ముందడుగు వేసింది. ప్రయాణ ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా ఎక్కువ మంది విదేశీ సందర్శకులను ఆకర్షించాలని ఆ దేశం ప్రయత్నిస్తోంది. ఈ కొత్త విధానం సౌదీ పర్యాటక రంగ వృద్ధికి మరింత ఊతమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ప్రయాణం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Recommended image2
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image3
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Related Stories
Recommended image1
Evil Eye: దిష్టి తీయడానికి ఉప్పు, మిరపకాయలనే ఎందుకు వాడతారు? అసలు ఈ అలవాటు ఎలా మొదలైంది?
Recommended image2
Supreme Court: బ‌ల‌వంతంగా భాష‌ను రుద్ద‌డ‌మంటే, విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డ‌మే.. సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved