- Home
- Business
- ఇకపై మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు.. భారత్‌లో తయారీ ప్రారంభించిన ఎలక్ట్రానిక్ దిగ్గజం. ఎక్కడో తెలుసా?
ఇకపై మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు.. భారత్‌లో తయారీ ప్రారంభించిన ఎలక్ట్రానిక్ దిగ్గజం. ఎక్కడో తెలుసా?
Samsung: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా దిగ్గజ కంపెనీలు భారత్‌లో తమ తయారీ యూనిట్లను ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఎలక్ట్రానిక్ దిగ్గజం భారత్‌లో తమ సొంత ల్యాప్‌టాప్‌ల తయారీని ప్రారంభించింది.

కీలక నిర్ణయం తీసుకున్న సామ్‌సంగ్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ భారత్‌లో తన ఉత్పత్తి విస్తరణలో భాగంగా కొత్త అడుగు వేసింది. ఇప్పటికే ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్స్, టాబ్లెట్లు తయారు చేస్తున్న గ్రేటర్ నోయిడా ఫ్యాక్టరీలో ల్యాప్‌టాప్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. భవిష్యత్తులో మరిన్ని పరికరాలను కూడా భారతదేశంలోనే తయారు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
KNOW
మరిన్ని పరికరాల తయారీకి కూడా
సామ్‌సంగ్ ప్రతినిధులు వార్తా సంస్థ PTIకి తెలిపిన వివరాల ప్రకారం.. "సామ్‌సంగ్ తన మాన్యుఫాక్చరింగ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. గ్రేటర్ నోయిడా ఫ్యాక్టరీలో ల్యాప్‌టాప్ తయారీ ప్రారంభమైంది. త్వరలోనే మరిన్ని పరికరాల ఉత్పత్తి కూడా భారత్‌లో ప్రారంభమవుతుంది" అని తెలిపారు.
కేంద్ర మంత్రితో సమావేశం
సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పీ. చున్ యూనియన్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భారత ప్రతిభ, ఇన్నోవేషన్ ఆధారంగా సామ్‌సంగ్ తన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పరికరాల తయారీని భారత్‌లో విస్తరిస్తూనే ఉంటుంది" అని తెలిపారు.
భారత మార్కెట్‌లో సామ్‌సంగ్ స్థానం
సామ్‌సంగ్ 1996లోనే భారత్‌లో తన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. యాపిల్ తర్వాత భారత్ నుంచి మొబైల్ ఫోన్లను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న సంస్థ సామ్‌సంగ్ అని ఈ సంవత్సరం ప్రారంభంలోనే సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ (MX) బిజినెస్ హెడ్ టీ.ఎం. రోహ్ ప్రకటించారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం భారత్‌లో వాల్యూమ్, విలువ పరంగా సామ్‌సంగ్ రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా ఉంది.
ల్యాప్‌టాప్ మార్కెట్‌లో సామ్‌సంగ్ స్థానం ఏంటంటే
ల్యాప్‌టాప్ విభాగంలో ఇంకా బలమైన మార్క్ సాధించకపోయినా, సైబర్‌మీడియా రీసెర్చ్ డేటా ప్రకారం, భారత్‌లో 15% మార్కెట్ షేర్ సామ్‌సంగ్‌కు ఉంది. కొత్త ఉత్పత్తి ప్రారంభంతో ఈ విభాగంలో కూడా తన స్థానం బలపర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది.