- Home
- Business
- Electric Scooter: రూ.60వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది కొంటే ఎన్నో స్పెషల్ బెనిఫిట్స్
Electric Scooter: రూ.60వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది కొంటే ఎన్నో స్పెషల్ బెనిఫిట్స్
ఈ స్కూటీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ.ల రేంజ్ ని అందిస్తుంది. ఇది అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఎరుపు, నీలం, తెలుపు రంగులలో లభిస్తాయి.

License Free Electric Scooter
మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవాలని ఉందా? అది కూడా తక్కువ ధరకే రావాలి.. మనకు బెస్ట్ మైలేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే.. మీ కోసమే మార్కెట్లోకి కొత్త స్కూటీ అడుగుపెట్టింది.గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ కి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఆంపియర్ మరో కొత్త మోడల్ స్కూటీ మార్కెట్లోకి విడుదల చేసింది. రియో80 పేరిట విడుదల చేసిన ఈ స్కూటీ ధర కేవలం రూ.59,900 కే కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం వల్ల మీకు అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ఇది కొన్నవారికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.
Electric Scooter in Budget Price
ఈ స్కూటీ గరిష్ట వేగం గంటకు 25 కిలో మీటర్ల కంటే తక్కువ కావడం గమనార్హం . ఈ స్కూటర్ లో చాలా ఫీచర్లు ఉన్నాయి. రియో 80 లో కలర్ LCD డిస్ప్లే, LFP బ్యాటరీ టెక్నాలజీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కీలెస్ స్టార్ట్ ఫంక్షనాలిటీ ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ.ల రేంజ్ ని అందిస్తుంది. ఇది అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఎరుపు, నీలం, తెలుపు రంగులలో లభిస్తాయి.
చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్
ఈ నెలలో భారతదేశం అంతటా దీని పంపిణీ ప్రారంభమవుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఇలా చేస్తున్నాం అని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్, CEO కె విజయ్ కుమార్ అన్నారు.
Top Range Electric Scooter
బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్
ఇంధన ధరలు పెరుగుతుండటంతో వాటికి ప్రత్యామ్నాయం కోసం అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్ వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో, తక్కువ దూరం ప్రయాణించాలి అనుకునేవారికి ఈ రియో80 స్కూటర్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇటీవలి నెలల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. వాహన్ డేటా ప్రకారం, మార్చి 2025లో 6,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలే అమ్ముడయ్యాయి. ఇది నెలవారీగా 52% వృద్ధిని సూచిస్తుంది. ఈ స్కూటీ కొన్నవారు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.