కుటుంబం మొత్తం ప్రయాణించే తక్కువ ధరలో లభించే 7 సీట్ల క్లాసీ కారు - ధరెంతో తెలుసా?
Renault Triber 2024: రెనాల్ట్ కొత్త రెనాల్ట్ ట్రైబర్ 2024 వేరియంట్ 7-సీటర్ కారును విడుదల చేసింది. ఇందులో ఆధునిక సౌకర్యాలు, మంచి మైలేజీ, పోటీ ధరలతో అందుబాటులోకి వచ్చింది. సౌకర్యవంతమైన-నమ్మదగిన ప్రయాణం కోసం చూస్తున్న కుటుంబాలకు ఈ కారు సరైన ఎంపిక.
Renault Triber 2024
రెనాల్ట్ ట్రైబర్ 2024 రెనాల్ట్ నుండి కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన 7 సీట్ల కారు. విశాలమైన, సరసమైన కుటుంబ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ తో ట్రైబర్ 2024 క్లాసీ ఫ్యామిలీ కారుగా చూడవచ్చు. ఇది అన్ని ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజీ, పోటీ ధరను కలిగి ఉంది. సౌకర్యవంతమైన, నమ్మదగిన ప్రయాణం కోసం చూస్తున్న కుటుంబాలకు అనువైనదిగా రూపొందించారు.
రెనాల్ట్ ట్రైబర్ 2024 సౌకర్యాన్ని పెంచే అనేక ఫీచర్లతో ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అవసరమైన అన్ని డ్రైవింగ్ సమాచారాన్ని ఒకే దగ్గర అందిస్తుంది. ఎల్ ఈడీ హెడ్ లైట్లు, టర్న్ బై టర్న్ ఇండికేటర్లు రహదారిపై మెరుగైన విజిబిలిటీ, భద్రతను నిర్ధారిస్తాయి. మల్టిపుల్ యూఎస్బీ పోర్టులు, ఛార్జింగ్ పాయింట్లు, క్లైమేట్ కంట్రోల్, ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Renault Triber 2024
ఆధునిక డ్యాష్ బోర్డ్, క్రూయిజ్ కంట్రోల్, సౌకర్యవంతమైన సీటింగ్ అమరికతో స్టైలిష్ లుక్, ఆచరణాత్మక ఉపయోగాన్ని ఇష్టపడే కుటుంబాలకు రెనాల్ట్ ట్రైబర్ 2024 అనువైన ఎంపికగా ఉంటుంది. 998 సీసీ ఇంజన్ స్మూత్ గేర్ మార్పులతో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను అందిస్తుంది. మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ట్రైబర్ 2024 లీటరుకు 18 నుండి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంధన ఖర్చులను ఆదా చేయాలనుకునే కుటుంబాలకు ఇది గొప్ప ఎంపిక. రోజువారీ ప్రయాణాలకు అనువైనది.
Renault Triber 2024
Renault Triber 2024 ధర ఇతర పోలీదారులతో పోలిస్తే చాలా తక్కునే చెప్పాలి. దీని ప్రారంభ ధర ₹6 లక్షల నుండి ₹9 లక్షల మధ్య ఉంటుంది. దాని విశాలమైన 7-సీటర్ కాన్ఫిగరేషన్, అధునాతన ఫీచర్లు, ఆకట్టుకునే మైలేజీని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ధరల శ్రేణి ట్రైబర్‌ను భారతీయ మార్కెట్‌లో తక్కువ బడ్జెట్ అనుకునే కుటుంబాలకు గొప్ప ఎంపికగా ఉంటుంది.
రోజువారీ ప్రయాణం లేదా సుదీర్ఘ కుటుంబ పర్యటనలు కావచ్చు, ట్రైబర్ 2024 అనేది భారతీయ వినియోగదారు అవసరాలను తీర్చగల సరసమైన, ఆధునిక ప్యూచర్లతో విశ్వసనీయమైన కుటుంబ కారుగా చూడవచ్చు.
Renault Triber 2024
2023 అప్డేట్ - బిఎస్ 6 ఫేజ్ 2 (ఆర్డీఈ), మెరుగైన భద్రతా కిట్, కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్లు మరింత సౌకర్యాన్ని కలిగిస్తాయి. మీ సౌలభ్యం-వినోదం కోసం అనేక ఎంపికలను అందిస్తుంది. దాని మాడ్యులర్ సీటింగ్ నుండి ప్రతి డ్రైవ్ లో మీకు సహాయపడే సౌకర్యవంతమైన నియంత్రణల సూట్ వరకు ఏవీ మిస కాలేదు.
రెనాల్ట్ ట్రైబర్ దాని ప్రత్యేక డిజైన్, 182 మిమీ ఎత్తుతో గ్రౌండ్ క్లియరెన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 15" స్టైల్ ఫ్లెక్స్ వీల్స్, మెరుగైన క్రోమ్ అసెంట్స్, ఏ లెవల్ సింగిల్-టోన్, డ్యూయల్-టోన్ రంగులలలో అందుబాటులో ఉన్నాయి.
Renault Triber 2024
రెనాల్ట్ ట్రైబర్ 2024 నాలుగు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి RXE, RXL, RXT, RXZ. 6 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, వేరియంట్లను బట్టి ధరలు మారుతాయి.
రెనాల్ట్ ట్రైబర్ 2024 వివిధ వేరియంట్‌లకు సంబంధించిన ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి:
RXE MT : రూ. 5.99 లక్షలు
RXL MT : రూ. 6.80 లక్షలు
RXT MT : రూ. 7.60 లక్షలు
RXT AT : రూ. 8.12 లక్షలు
RXZ MT : రూ. 8.22 లక్షలు
RXZ AT : రూ. 8.74 లక్షలు