జియో ఐపీవో: ముఖేష్ అంబానీ బిగ్ ప్లాన్.. ఇన్వెస్ట్‌మెంట్ కు మంచి ఛాన్స్.. ఎందుకంటే?
Jio IPO: రిలయన్స్ AGM 2025లో ముఖేష్ అంబానీ జియో ఐపీవో గురించి ప్రస్తావించారు. ఇది పెట్టుబడిదారులకు మంచి అవకాశం. మీరు కూడా జియో లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. దీంతో మీరు మంచి లాభాలు అందుకునే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

జియో IPO పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్న ముఖ్యమైన ప్రకటన చేశారు.
జియో IPO (Initial Public Offering) కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 2026 ప్రథమార్థంలో షేర్ మార్కెట్‌లో జియోను లిస్ట్ చేయడమే లక్ష్యం అని అంబానీ స్పష్టం చేశారు. అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు సమయానికి వస్తే ఈ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.
KNOW
ముఖేష్ అంబానీ ఏమన్నారు?
AGM వేదిక నుంచి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. “జియో IPO కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మా లక్ష్యం 2026 ప్రథమార్థంలో IPO లిస్టింగ్ చేయడం. అవసరమైన అనుమతులు సమయానికి లభిస్తే ఇది సాధ్యమే. జియో కూడా తన గ్లోబల్ కౌంటర్‌పార్ట్స్‌లా భారీ విలువను సృష్టించే సామర్థ్యం కలిగి ఉందని ఇది నిరూపిస్తుంది. పెట్టుబడిదారులకు ఇది చాలా పెద్ద అవకాశం అవుతుంది” అని అన్నారు.
జియో ఐపీవో ఇన్వెస్ట్‌మెంట్ కు ఎందుకు పెద్ద అవకాశం?
జియో ఊపీవో అనేది 2006లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ తర్వాత, ఈ సంస్థ పెద్ద బిజినెస్ యూనిట్ నుంచి వచ్చే తొలి పబ్లిక్ ఆఫర్ అవుతుంది. ఇప్పటికే ఈ టెలికాం సంస్థలో మెటా ప్లాట్‌ఫారమ్, గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఐపీవో ద్వారా పెట్టుబడిదారులకు భారత్‌లో అతిపెద్ద టెలికాం కంపెనీలో నేరుగా పెట్టుబడి చేసే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం జియోకు 500 మిలియన్లకుపైగా కస్టమర్లు ఉన్నారు. ఇటీవలే జియో, స్పేస్‌ఎక్స్ (Starlink)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించనుంది. ప్రస్తుతం అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న జియోలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
జియో భవిష్యత్ ప్రణాళికలు
జియో తన విస్తరణ ప్రణాళికలను AGMలో స్పష్టంచేసింది.
• ప్రతి భారతీయుడిని మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌తో కలపడం.
• ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందించడం.
• వ్యాపారాలను సురక్షిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా డిజిటైజ్ చేయడం.
• ‘AI Everywhere for Everyone’ అనే కొత్త ఆవిష్కరణను వేగవంతం చేయడం.
• జియోను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలను వెతకడం.
జియో ఆర్థిక పనితీరు (FY26 తొలి త్రైమాసికం - ఏప్రిల్ నుంచి జూన్ 2025)
• నికర లాభం: రూ. 7,110 కోట్లు
• ఆదాయం: రూ. 41,054 కోట్లు (+19% వార్షిక వృద్ధి)
• ARPU (ప్రతి యూజర్ సగటు ఆదాయం): రూ. 208.8
• 5G యూజర్లు: 200 మిలియన్లకు పైగా
• హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు: 20 మిలియన్లకు పైగా
జియో 5 ప్రధాన మైలురాళ్లు
1. ఉచిత వాయిస్ కాల్స్ ద్వారా మార్కెట్ లోకి 4జీ సేవలను తీసుకొచ్చింది.
2. మొబైల్‌లో వీడియో వీక్షణ, డిజిటల్ లావాదేవీల అలవాటు తీసుకువచ్చింది.
3. ఆధార్, UPI, జనధన్, DBT వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు బలమైన పునాది వేసింది.
4. ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను నిర్మించింది, ఇందులో 100కుపైగా యూనికార్న్ లు ఉన్నాయి.
5. ప్రపంచంలోనే వేగవంతమైన AI విప్లవానికి మౌలిక వేదికను అందించింది.
కాబట్టి మంచి లాభాలతో సాగుతున్న జియో ఐపీవో మీకు నేరుగా ఈ సంస్థతో భాగస్వామ్యం అవ్వడానికి పెద్ద అవకాశమని చెప్పవచ్చు.