MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • రిలయన్స్ AGM 2025: జియో IPO, AI ప్లాన్స్ పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

రిలయన్స్ AGM 2025: జియో IPO, AI ప్లాన్స్ పై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

Reliance AGM 2025 Key Highlights: రిలయన్స్ ఏజీఎం 2025లో జియో ఐపీవో, ఏఐ భాగస్వామ్యాలు, FMCG లక్ష్యాలు, గ్లోబల్ విస్తరణ సహా పలు అంశాలపై ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 29 2025, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (Reliance AGM 2025)
Image Credit : x/Reliance

రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (Reliance AGM 2025)

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)ను శుక్రవారం (2025 ఆగస్టు 29న) నిర్వహించింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ షేర్‌హోల్డర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు కీలక ప్రకటనలు చేశారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి దశలో ఉన్నప్పటికీ, 21వ శతాబ్దం "సువర్ణ యుగం" వైపు అడుగులు వేస్తుందని చెప్పారు. సంస్థ అద్భుతమైన ప్రయాణం చేస్తోందన్నారు.

DID YOU
KNOW
?
దేశంలో అతిపెద్ద టెలికాం జియో
జియో అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో అత్యధిక సబ్స్క్రైబర్లను సంపాదించి, నంబర్ 1 టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. 2025 నాటికి జియో 500 మిలియన్ల కస్టమర్లను దాటింది, ఇది టెలికాం రంగంలో ఒక పెద్ద మైలురాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జియో ఐపీవో ప్రణాళికలపై ముఖేష్ అంబానీ వ్యాఖ్యలు
Image Credit : X/Reliance Jio (@reliancejio)

జియో ఐపీవో ప్రణాళికలపై ముఖేష్ అంబానీ వ్యాఖ్యలు

AGMలో అత్యంత ముఖ్యమైన ప్రకటన జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీవో. అంబానీ వెల్లడించిన ప్రకారం, జియో 2026 మొదటి అర్ధభాగంలో (H1CY26) షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ కానుంది. జియో IPO భారతదేశంలోనే అతిపెద్ద ఇష్యూ అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 66.5% వాటా ఉంది.

జియో ఇప్పటికే 500 మిలియన్ కస్టమర్లను సాధించి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పేర్కొన్నారు.

36
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో భారీ పెట్టుబడులు
Image Credit : ChatGPT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో భారీ పెట్టుబడులు

భవిష్యత్తులో AI కీలక పాత్ర పోషిస్తుందని ముఖేష్ అంబానీ చెప్పారు. గూగుల్‌తో భాగస్వామ్యంలో జామ్‌నగర్‌లో AI క్లౌడ్ రీజియన్ ఏర్పాటు కానుంది. మెటాతో కలసి ఓపెన్ సోర్స్ AI మోడల్స్ ను అభివృద్ధి చేసి చిన్న వ్యాపారాలకు అందించనున్నారు. 

ఇందుకోసం కొత్తగా రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే సబ్సిడియరీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. AI డేటా సెంటర్లు నిర్మించడం, గ్లోబల్ భాగస్వామ్యాలు, సులభమైన AI సేవలు అందించడం, ప్రపంచ స్థాయి AI ప్రతిభను పెంపొందించడం దీని లక్ష్యాలుగా ఉన్నాయి.

46
FMCG వ్యాపారంపై అంబానీ
Image Credit : Getty

FMCG వ్యాపారంపై అంబానీ

రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL)ను RIL నేరుగా అనుబంధ సంస్థగా మార్చనున్నట్లు అంబానీ ప్రకటించారు. గత 3 ఏళ్లలో RCPL రూ.11,500 కోట్ల రెవెన్యూ సాధించింది. వచ్చే 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్లు రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకున్నారు. FMCGతో పాటు వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర విభాగాల్లోనూ విస్తరించనున్నట్లు వెల్లడించారు.

56
రిలయన్స్ భవిష్యత్ వృద్ధి ప్రణాళికలు
Image Credit : Getty

రిలయన్స్ భవిష్యత్ వృద్ధి ప్రణాళికలు

2028 నాటికి కంపెనీ EBITDAను రెట్టింపు చేస్తామని ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్, RCPL వంటి కొత్త వ్యాపారాలు భవిష్యత్ వృద్ధికి ఇంజన్లుగా నిలుస్తాయని చెప్పారు. కొత్త ఎనర్జీ బిజినెస్ వచ్చే ఐదేళ్లలో ఆయిల్-టు-కెమికల్స్ విభాగం కంటే పెద్దదిగా ఎదుగుతుందని చెప్పారు.

66
రిలయన్స్ ఆర్థిక ప్రగతి 2025
Image Credit : ANI

రిలయన్స్ ఆర్థిక ప్రగతి 2025

మొత్తం ఆదాయం: రూ. 10.71 లక్షల కోట్లు

EBITDA: రూ. 1.83 లక్షల కోట్లు

నికర లాభం: రూ. 81,309 కోట్లు

ప్రభుత్వానికి చెల్లింపులు: రూ. 2.10 లక్షల కోట్లు

ఉద్యోగులు: 6.8 లక్షలు (త్వరలో 10 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
భారతీయ టెలికాం
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
iPhone 17 నుంచి Realme 15T వరకు.. సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు
Recommended image2
లూలు మాల్ vs డిమార్ట్: రెండింట్లో దేనిలో తక్కువ ధరకు సరుకులు వస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved