రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.. దరఖాస్తు వివరాలు తెలుసుకోండి..
ఇండియన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిలయన్స్ ఫౌండేషన్ తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది, దీని కింద 100 మంది అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తించి గ్రాంట్ అవార్డు అండ్ డేవల్ప్మెంట్ ప్రోగ్రామ్‌తో "సామాజిక మంచి కోసం వారి స్కిల్స్ పెంపొందించడానికి" మద్దతు ఇస్తుంది.

2021లో 76 మంది మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్లు , పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అండ్ కంప్యూటర్ సైన్సెస్‌లో రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు లభించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
అర్హత : భారతదేశంలోని ఇన్‌స్టిట్యూట్‌ల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందుకు ఎంట్రీ ఫీజు లేదు.
స్కాలర్‌షిప్ స్లాట్లు : రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గరిష్టంగా ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, 40 మంది వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిగ్రీ కాలానికి ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లభిస్తాయి.
స్కాలర్‌షిప్ బేసిస్: మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు అందించబడతాయి అలాగే సోసియో ఎకనామిక్ బ్యాక్ గ్రౌండ్ నుండి కూడా దరఖాస్తుదారులను దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహిస్తుంది.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ (RF) అందరికీ ఉన్నత జీవన ప్రమాణాలను అందించడానికి ట్రాన్స్ఫర్మేటిక్ మార్పులను సులభతరం చేయడానికి పని చేస్తుంది అని కంపెనీ పేర్కొంది.
"రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ సంవత్సరానికి 14,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాయి, అయితే ధీరూభాయ్ అంబానీ స్కాలర్‌షిప్‌లు 1996 నుండి 12,500 కంటే ఎక్కువ స్కాలర్‌షిప్‌లను అందించాయి, వీటిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మెరిట్-కమ్-మీన్స్ ఆధారంగా అందించాయి," అని పేర్కొంది.