ఉదయం లేవగానే జిమ్, 19వ అంతస్తులో అల్పాహారం.. ఇది అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ దినచర్య..
First Published Dec 2, 2020, 3:30 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది. భారతదేశంలో మాత్రమే కాదు మొత్తం ఆసియాలోనే ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీల అత్యంత ధనవంతులైన జంట. ముకేష్ అంబానీ ఆదాయాన్ని చూస్తే, అతను ప్రతి గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడు అంటే ప్రతి నిమిషానికి 1.5 కోట్లు సంపాదిస్తున్నట్లు. భారతదేశపు అత్యంత ధనవంతుడు, బిలియనీర్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

ముకేష్ అంబానీ దినచర్య గురించి మీడియా నివేదికల ద్వారా, కొన్ని ఇంటర్వ్యూలలో స్వయంగా ముకేష్ అంబానీ లేదా అతని భార్య నీతా అంబానీ తన దినచర్య గురించి చెప్పారు.

ఇంట్లో ఉదయాన్నే మొదట లేచే వారిలో ముకేష్ అంబానీ ఒకరు. అతను రోజూ ఉదయం 5 నుంచి 5.30 గంటల మధ్య నిద్ర లేస్తాడు. లేచిన తరువాత మొదట జిమ్ చేస్తాడు. ముకేష్ అంబానీ ఇల్లు ఆంటిలియాలోని రెండవ అంతస్తులో విలాసవంతమైన జిమ్ ఉంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?