- Home
- Business
- Business Idea: మహిళలు ఇది మీకోసమే.! ఇంట్లో ఖాళీగా ఉన్నారా.? ఈ వ్యాపారంతో నెలకు రూ. 50 వేలు పక్కా..
Business Idea: మహిళలు ఇది మీకోసమే.! ఇంట్లో ఖాళీగా ఉన్నారా.? ఈ వ్యాపారంతో నెలకు రూ. 50 వేలు పక్కా..
Business Idea: మహిళలకు తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే అద్భుతమైన వ్యాపారం రెడీమేడ్ బ్లౌజుల సేల్స్. క్వాలిటీ బ్లౌజులను హోల్‌సేల్‌గా తెచ్చుకుని, ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తూ నెలకు వేల రూపాయలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి.

స్వయం ఉపాధి దిశగా అడుగులు..
నేటి కాలంలో మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలో సరికొత్త అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం చీరలే కాకుండా, ప్రస్తుతం మార్కెట్లో ‘రెడీమేడ్ బ్లౌజులకు’ విపరీతమైన డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో, ఎవరి సహాయం లేకుండా ఇంటి నుండే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.
రెడీమేడ్ బ్లౌజ్ బిజినెస్
ఈ వ్యాపారంలో పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా డైలీవేర్ బ్లౌజులు హోల్‌సేల్ మార్కెట్లో రూ. 130 నుంచి రూ. 150 మధ్య లభిస్తాయి. వీటిని మనం రిటైల్‌గా రూ. 250 నుంచి రూ. 300 వరకు సులభంగా అమ్ముకోవచ్చు.
మార్జిన్: ఒక బ్లౌజ్ మీద సుమారు రూ. 50 నుంచి రూ. 100 వరకు లాభం పొందే అవకాశం ఉంది.
క్వాలిటీ: ధరను బట్టి క్లాత్ క్వాలిటీ మారుతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్లకు నమ్మకమైన క్వాలిటీ అందించడం ముఖ్యం.
సేకరణ, సేల్స్
హోల్‌సేల్ షాపుల్లో కనీసం 15 నుంచి 50 బ్లౌజులు లేదా రూ. 5000 విలువైన సరుకు తీసుకుంటేనే మనకు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని ఆన్‌లైన్ ద్వారా లేదా వాట్సప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేసుకుని విక్రయించవచ్చు. తక్కువ మార్జిన్ పెట్టుకుని ఎక్కువ సంఖ్యలో బ్లౌజులు అమ్మడం ద్వారా నెలాఖరుకు మంచి ఆదాయం సంపాదించవచ్చు. కేవలం బ్లౌజులే కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజులకు కూడా ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది.
పొదుపు మంత్రం - బిజినెస్ సీక్రెట్
ఆన్‌లైన్ లావాదేవీల వల్ల మనకు ఎంత లాభం వస్తుందో ఒక్కోసారి స్పష్టత ఉండదు. అందుకే, ప్రతి నెలా అమ్మిన బ్లౌజుల తాలూకు నగదును ఒక డబ్బాలో వేసి పొదుపు చేయడం వల్ల నెల చివరన మన బిజినెస్ ఎంత జరిగింది. అసలు, లాభం ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది.
భవిష్యత్తు అవకాశాలు
బ్లౌజులతో పాటు రాబోయే రోజుల్లో చీరలు, ఇమిటేషన్ జ్యువెలరీ, వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఎలా చేయాలి, ఎక్కడ నుంచి సరుకు తెచ్చుకోవాలి అనే విషయాలను కూడా వివరించారు. జెన్యూన్‌గా ఇంటి నుండే పని చేయాలనుకునే మహిళలకు ఇది ఒక చక్కని అవకాశం.

