Prepayment Penalty లోన్ ముందే కట్టేస్తే ఫైన్ ఉండదోచ్..? ఎవరెవరికంటే..!
బ్యాంకులు, రుణ సంస్థల్లో తీసుకున్న రుణం గడువుకు ముందే తీర్చేస్తే ‘ప్రి పెనాల్టీ’ పేరుతో ఆ సంస్థలు వినియోగదారుడి నుంచి కొంతమొత్తం వసూలు చేస్తుంటాయి. ఈ ఫైన్ కస్టమర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తుంటుంది. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఈ తలనొప్పి ఉండదు. లోన్ టైమ్ కంటే ముందే కడితే ఫైన్ కట్టక్కర్లేదు. ఇది వ్యక్తులు, వ్యాపార సంస్థలు అందరికీ వర్తిస్తుంది.
14

హమ్మయ్య బాధ లేదిక
గతంలో తీసుకున్న రుణాన్ని, టైమ్ కంటే ముందే కట్టేస్తే ఫైన్ చెల్లించాల్సి వచ్చేది. ఫ్లోటింగ్ రేట్ లోన్ తీసుకున్నా, గడువుకు ముందే కట్టేస్తే ఈ ఫైన్ కట్టాల్సి వచ్చేది.
24
ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. ఎప్పుడంటే అప్పుడు లోన్ కట్టేయొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై లోన్ ముందే కడితే ఏ బ్యాంకు కూడా ఫైన్ వేయడానికి లేదు.
34
చిన్న బిజినెస్ వాళ్లకి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఆర్బీఐ దీనికి సంబంధించిన నిబంధనలు, విధివిధానాలు సిద్ధం చేసింది. 2025 మార్చి 21 వరకు అందరి సలహాలు తీసుకుని ఆర్బీఐ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది.
44
దీని ప్రకారం ఆర్బీఐ పరిధిలోని ఏ బ్యాంకు కూడా లోన్ ముందే కడితే ఫైన్ వేయకూడదు. కొన్ని సంస్థలు ఫ్లోటింగ్ రేట్ లోన్లకు ఫైన్ వేస్తున్నాయి. కానీ బిజినెస్ కాకుండా వేరే లోన్లకు ఫైన్ లేదు. చిన్న, పెద్ద బ్యాంకులేవైనా బిజినెస్ కోసం తీసుకున్న లోన్లకు ఫైన్ వేయకూడదు.
Latest Videos