రతన్ టాటా చాలా గ్రేట్: ఈ ఫేమస్ స్టార్టప్స్‌ను ప్రోత్సహించింది ఆయనే
ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్కు వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు కనిపిస్తుంది. రతన్ టాటా యువ పారిశ్రామిక వేత్తలను ఎంతగానో ప్రోత్సహించే వారు. ఐడియా నచ్చితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహించేవారు. ముఖ్యంగా స్టార్టప్ లను ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు టాటా గ్రూప్స్ తయారు చేస్తున్న వస్తువులు ప్రతి ఇంటిలోనూ ఉంటున్నాయి. ఉప్పు నుంచి ఐరన్ వరకు, అలా టాటా గ్రూప్స్ సహకారంతో డవలప్ అయిన కొన్ని కంపెనీలు, స్టార్టప్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన కంపెనీలలో టాటా గ్రూప్స్ ఒకటి. దీనికి 155 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. 100 కి పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2022–2023 ఆర్థిక సంవత్సరానికి అమ్మకాలలో 150 బిలియన్ డాలర్ల అంచనాతో టాటా సంస్థ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. ముఖ్యంగా ఇది 30 కి పైగా వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇవి కాకుండా కొన్ని స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జుడియో(Zudio)
ట్రెంట్ లిమిటెడ్ ఫ్యాషన్ బ్రాండ్ Zudioలో టాటా సంస్థ పెట్టుబడులు పెట్టింది. జుడియో స్టైలిష్, బడ్జెట్ కాస్ట్ దుస్తులు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది. ఫాస్ట్-ఫ్యాషన్ స్టోర్‌గా, Zudio సరసమైన ధరలకు ఫ్యాషన్ దుస్తులను కోరుకునే విస్తృత శ్రేణి వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
జరా(Zara)
స్పానిష్ ఫ్యాషన్ దిగ్గజం ఇండిటెక్స్‌తో జాయింట్ వెంచర్ ద్వారా ప్రఖ్యాత అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ జారాకు టాటా గ్రూప్ సపోర్ట్ గా ఉంది. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం ఇండిటెక్స్ ట్రెంట్ బ్రాండ్ కింద భారతదేశంలో 21 జారా స్టోర్‌లను నిర్వహిస్తోంది. స్థానిక రిటైల్ వ్యాపారంలో ప్రధాన పాత్రధారి అయిన జారా దాని ఫాస్ట్ ఫ్యాషన్ ఉత్పత్తులకు ఫేమస్. అంతేకాకుండా వినియోగదారులకు అంతర్జాతీయ ట్రెండ్‌లను పరిచయం చేయడంలో ప్రసిద్ధి చెందింది.
బిగ్ బాస్కెట్(Big Basket)
2011లో నెలకొల్పిన బిగ్ బాస్కెట్ భారతదేశంలో మొట్టమొదటి ఆన్‌లైన్ కిరాణా దుకాణం. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో ఇది కూడా ఒక భాగం. ఒక అనుబంధ సంస్థ ద్వారా టాటా 2021లో వ్యాపారంలో 64 శాతం వాటాను కొనుగోలు చేసింది. సాఫ్ట్‌వేర్ సంస్థగా ప్రారంభమైన బిగ్ బాస్కెట్, వినియోగదారులకు ఆహ్లాదకరమైన ఆన్‌లైన్ కొనుగోలు అనుభవాన్ని అందించడం ద్వారా భారతదేశంలో కిరాణా షాపింగ్‌ను మార్చింది.
స్టార్‌బక్స్(Star bucks)
కాఫీ సంస్కృతికి ప్రపంచ చిహ్నం అయిన స్టార్‌బక్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో తన స్థానాన్ని ఏర్పరచుకుంది. అక్టోబర్ 2012లో ప్రారంభమైన టాటా స్టార్‌బక్స్, ప్రాంతీయ రుచులను ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్‌తో మిళితం చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్టార్‌బక్స్ ప్రధాన నగరాల్లో పేరు తెచ్చుకుంది. భారతీయులకు నచ్చినట్టుగా రుచులు అందిస్తూ ఫేమస్ అయ్యింది.
తాజ్ హోటల్స్(Taj Hotels)
టాటా గ్రూప్ పిల్లర్స్ లో తాజ్ హోటల్స్ ఒకటి. 1902లో జంషెట్జీ టాటా వీటిని స్థాపించారు. ఇది ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ విభాగం. ముంబైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న తాజ్ హోటల్స్ వినియోగదారులకు గొప్ప వసతి అందిస్తోంది. ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చే హోటల్స్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఇవి కాకుండా రతన్ టాటా వివిధ విభిన్న రంగాలలో ఉన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిలో చాలా శక్తివంతమైన స్టార్టప్స్ కూడా ఉన్నాయి. ఆయన పెట్టుబడి పెట్టిన కొన్ని ప్రధాన కంపెనీలు మరియు విభాగాలు ఇక్కడ ఉన్నాయి.
పేటీఎం(Paytm)ఒక డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. ఒలా(Ola) రైడ్ షేరింగ్ కంపెనీ. ఇది క్యాబ్ సేవలను అందిస్తుంది. జివేమ్ (Zivame) ఆన్‌లైన్ లింజరీ బ్రాండ్, మహిళల కోసం ప్రత్యేకమైన ఫ్యాషన్ ఉత్పత్తులు అందిస్తుంది. స్నాప్‌డీల్ (Snapdeal) ఇది ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్. ఇండియాలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల్లో ఇదీ ఒకటి. అర్బన్ క్లాప్ (UrbanClap) ఇది ఒక హోమ్ సర్వీసెస్ ప్రొవైడర్. లెన్స్‌కార్ట్ (Lenskart) ఆన్‌లైన్ ఐ-వేర్ రిటైల్ ప్లాట్‌ఫామ్ ఇది. బైజూస్ (BYJU'S) విద్య రంగంలో ప్రముఖ సంస్థ బైజూస్. ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ టెక్నాలజీ (EdTech) విభాగంలో నిలిచింది. క్యూర్.ఫిట్ (Cure.Fit) ఆరోగ్యం, ఫిట్నెస్‌కు సంబంధించిన సేవలను అందించే స్టార్టప్ ఇది. బ్లూస్మార్ట్ (BluSmart) ఎలక్ట్రిక్ వాహన రైడ్, హైలింగ్ ప్లాట్‌ఫామ్ కూడా. రతన్ టాటా వీటితో పాటు మరిన్ని స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెట్టారు. వీటితో ఆయన సాంకేతికత, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, ఎడ్యుకేషన్ వంటి విభాగాల అభివృద్ధికి సహకరించారు.