- Home
- Business
- Ratan Tata, Shantanu Naidu: రతన్ టాటా ఫ్రెండ్ శాంతను నాయుడుకి టాటా మోటార్స్‌లో కీలక పదవి
Ratan Tata, Shantanu Naidu: రతన్ టాటా ఫ్రెండ్ శాంతను నాయుడుకి టాటా మోటార్స్‌లో కీలక పదవి
రతన్ టాటా మరణం తర్వాత ఆయన సన్నిహితుడైన శాంతను నాయుడుకి టాటా మోటార్స్‌లో కీలక పదవి లభించింది. ఈ విషయాన్ని శాంతను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్త, దాత, దేశం కోసం ఎంతో సాయం చేసిన మహోన్నతులు దివంగత రతన్ టాటా మరణం దేశం మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన చనిపోవడంతో వ్యాపార ప్రపంచం ఎంతో దుఃఖించింది. ముఖ్యంగా ప్రజలకు మంచి జరుగుతుందంటే లాభాపేక్ష లేకుండా విరివిగా సాయం చేసే దాత రతన్ టాటా కావడంతో యువ వ్యాపారవేత్తలు చాలా బాధపడ్డారు.
అలాంటి రతన్ టాటా జీవితంలో శాంతను నాయుడు కీలకమైన వ్యక్తి. యువ వ్యాపారవేత్తగా రతన్ టాటా దగ్గరకు వచ్చిన శాంతను నాయుడు ఆయన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తిగా మారిపోయారు.
గతంలో శాంతను నాయుడు గుడ్‌ఫెలోస్ అనే సంస్థను ప్రారంభించారు. దీనిలో రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. శాంతను ఆలోచనలు, సమాజానికి మేలు చేయాలన్న ఉత్సాహం రతన్ టాటాను బాగా ఇంప్రస్ చేశాయి.
తనకు మేనేజర్ గా ఉండమని శాంతనును రతన్ టాటా కోరడంతో ఆయన వద్ద చేరారు. ఇద్దరి ఐడియాలజీ ఒకేలా ఉండటంతో చాలా తక్కువ టైమ్ లో రతన్ టాటా, శాంతను నాయుడు తండ్రి, కొడుకుల్లా కలిసి జీవించారు.
టాటా మరణం తర్వాత 4 నెలలకు శాంతనుకి టాటా మోటార్స్‌లో కీలక పదవి లభించింది. ఈ విషయాన్ని శాంతను సోషల్ మీడియాలో పంచుకున్నారు. టాటా మోటార్స్‌లో కొత్త పదవి చేపట్టడం ఆనందంగా ఉందని శాంతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నాన్న టాటా మోటార్స్ నుంచి ఇంటికి వస్తే చూడడానికి ఎదురు చూసేవాడిని. ఇప్పుడు అక్కడే నా పని ప్రారంభిస్తున్నాను. టాటా మోటార్స్ జనరల్ మేనేజర్, చీఫ్ అడ్వైజర్‌గా నియమితులయ్యాను’ అని తన పోస్టులో పేర్కొన్నారు.
1993లో తెలుగు కుటుంబంలో జన్మించిన శాంతను నాయుడు, పూణే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, కార్నెల్ విశ్వవిద్యాలయంలో MBA పూర్తి చేశారు. 2018లో రతన్ టాటా అసిస్టెంట్‌గా చేరారు. అనేక ప్రాజెక్టుల్లో టాటాతో కలిసి పనిచేశారు. వీధి కుక్కల సంరక్షణ కోసం ఒక వినూత్న వ్యవస్థను రూపొందించినప్పుడు టాటాతో శాంతను బంధం మరింత బలపడింది. ఈ ప్రాజెక్టులో టాటా పెట్టుబడి పెట్టారు. ఈ సహకారం శాంతను జీవితంలో కీలక మలుపు. టాటా మద్దతు ఆయనకు గొప్ప ప్రేరణ. "ఐ కెన్ అప్పాన్ ఎ లైట్‌హౌస్" అనే పుస్తకంలో టాటాతో తన అనుభవాలను శాంతను పంచుకున్నారు.
ఇది కూడా చదవండి చిన్నతరహా పరిశ్రమ పెట్టాలంటే ఇదే మంచి టైం, లోన్స్ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్