- Home
- Business
- MSME Loans: చిన్నతరహా పరిశ్రమ పెట్టాలంటే ఇదే మంచి టైం, లోన్స్ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
MSME Loans: చిన్నతరహా పరిశ్రమ పెట్టాలంటే ఇదే మంచి టైం, లోన్స్ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
MSME Loans: చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి క్రెడిట్ కార్డుల ద్వారా లోన్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు 2025 బడ్జెట్‌లో మైక్రో సంస్థలకు రూ.5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది MSMEలకు పెట్టుబడి సహాయాన్ని ప్రోత్సహించనున్నాయి. అందువల్ల మీరు చిన్న తరహా పెట్టాలనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి టైం.

MSMEలకు క్రెడిట్ కార్డు రుణాలు
ఉదయం పోర్టల్‌లో నమోదైన మైక్రో సంస్థలకు క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్‌లో రూ.5 లక్షల పరిమితితో ఈ కార్డులు వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా రామన్ తెలిపారు. మొదటి దశలో 10 లక్షల కార్డులు జారీ చేస్తామన్నారు.
MSMEలకు 8-10% వడ్డీకే రుణాలు
ఈ చర్య వ్యాపారాలకు మూలధన సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కార్డుల ద్వారా 8-10% వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఇది అధిక వడ్డీలతో అనధికారిక రుణాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
7.5 కోట్ల మందికి ఉద్యోగాలు
సరసమైన రుణాలతో మైక్రో సంస్థలకు ఆర్థిక బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని 2025 కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ప్రస్తుతం భారతదేశ MSME రంగం 7.5 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇలా మరింత మందిని ప్రోత్సహించడం కోసమే చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
MSME రంగానికి ప్రోత్సాహం
క్రెడిట్ గ్యారెంటీ పథకాలు.. స్టార్టప్‌లకు పెట్టుబడి నిధులతో పాటు MSME రంగంలో పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ఉదయం పోర్టల్ కీలకం
చిన్న తరహా పరిశ్రమలను ఎంకరేజ్ చేయడంలో ఉదయం పోర్టల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రెడిట్ కార్డులు డిజిటల్ సాధనాలను అందించి, MSMEలు చెల్లింపులను నిర్వహించడానికి, నిధులను ట్రాక్ చేయడానికి సహాయపడతాయి. అందువల్ల చిన్న తరహా పరిశ్రమలు పెట్టే ఆలోచనలో ఉంటే ఇదే కరెక్ట్ టైమ్. కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని తీసుకొని వేగంగా డవలప్ కావచ్చు.