MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.100కే రైల్వే స్టేషన్స్‌లో ఏసీ రూమ్‌లు: ట్రైన్ వచ్చే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు

రూ.100కే రైల్వే స్టేషన్స్‌లో ఏసీ రూమ్‌లు: ట్రైన్ వచ్చే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు

రైల్వే స్టేషన్ లో ట్రైన్ బాగా లేట్ అవుతుందని తెలిస్తే మనం ఏం చేస్తాం. రెస్ట్ తీసుకోవడానికి హోటల్స్ ఎక్కడున్నాయని వెతుకుతాం కదా.. కాని రైల్వే స్టేషన్స్ లోనే కేవలం రూ.100 లకే ఏసీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా? ఈ ఫెసిలిటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 22 2024, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

విశ్రాంతి తీసుకోవడానికి రైల్వే స్టేషన్లలోనే తక్కువ ధరకే లగ్జరీ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు హోటళ్లతో పోలిస్తే ఇక్కడ అద్దె చాలా తక్కువ ఉంటుంది. ఈ రూమ్‌లలో ఏసీ, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. కాని ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. ట్రైన్ ఆలస్యంగా వస్తోందని తెలిస్తే విశ్రాంతి తీసుకోవడానికి దగ్గర్లో హోటల్స్ వెతుకుతారు. వారు గంటల చొప్పున కూడా అద్దె వసూలు చేస్తారు. అది కూడా చాలా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా ఈజీగా తక్కువ ధరకే ఏసీ రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రైల్వే స్టేషన్‌లోనే తక్కువ ధరకే లభించే ఈ లగ్జరీ రూమ్స్ లో సౌకర్యాలు హోటల్ రూమ్స్‌లో ఉండే సౌకర్యాలకంటే ఏమాత్రం తక్కువ ఉండవు. హోటళ్లతో పోలిస్తే చాలా తక్కువ ధరకే ప్రయాణికులకు లగ్జరీ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, ఇతర సౌకర్యాలు ఈ రూమ్‌లలో ఉంటాయి. వీటి అద్దె రూ.100 నుండి రూ.700 వరకు ఉంటుంది. 

35

రైల్వే స్టేషన్ లో రూమ్స్ బుక్ చేసుకోవడం వల్ల ఖరీదైన హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. డబ్బు, సమయం ఆదా అవుతుంది. ప్రయాణికులకు ఈ రూమ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రయాణం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఈ రూమ్‌లు చాలా బాగుంటాయి. కొన్ని గంటలు ఉండి రెస్ట్ తీసుకోవాలనుకున్న వారికి కూడా ఉపయోగపడతాయి. రెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. 

45

IRCTC రిటైరింగ్ రూమ్ బుకింగ్

మీరు గాని రైల్వే స్టేషన్ లో రూమ్ బుక్ చేయాలనుకుంటే ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా ఈజీగా రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు.

ముందుగా మీ ఐఆర్‌సిటిసి అకౌంట్‌లో లాగిన్ అవ్వండి.

మై బుకింగ్స్ సెక్షన్‌కి వెళ్లండి.

రిటైరింగ్ రూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

మీ ప్రయాణ వివరాలు, వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి.

మీరు ఎంచుకున్న సమయాన్ని బట్టి పేమెంట్ చేయండి.

55

రిటైరింగ్ రూమ్‌ల ఫెసిలిటీ చాలా రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది. అందువల్ల ప్రయాణికులు హోటళ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రూమ్‌లు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. తక్కువ బడ్జెట్ తో ప్రయాణం చేయాలనుకున్న వారికి కూడా ఈ రూమ్ ఫెసిలిటీ చాలా మంచి ఆప్షన్.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved