MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Apartment: అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే కొన్ని ఏళ్ల తర్వాత దాని విలువ తగ్గిపోతుందా.? మీ కళ్లు తెరిపించే నిజం..

Apartment: అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే కొన్ని ఏళ్ల తర్వాత దాని విలువ తగ్గిపోతుందా.? మీ కళ్లు తెరిపించే నిజం..

Apartment: అపార్ట్మెంట్ ఫ్లాట్లు పాతబడటం వల్ల వాటి విలువ తగ్గిపోతుందనేది అపోహ మాత్రమేనని రియల్ ఎస్టేట్ నిపుణులు స్పష్టం చేశారు. రీ-డెవలప్‌మెంట్ ద్వారా పాత ఫ్లాట్లు కొత్తవిగా మారుతాయని, దశాబ్దాల క్రితం పెట్టిన..

2 Min read
Author : Pavithra D
Published : Apr 28 2026, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అపార్ట్మెంట్ ఫ్లాట్ అపోహలు:
Image Credit : Pinterest

అపార్ట్మెంట్ ఫ్లాట్ అపోహలు:

అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొంటే 20 ఏళ్ల తర్వాత దాని విలువ తగ్గిపోతుందనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. కాలక్రమేణా భవనం పాతబడవచ్చు కానీ, ఆ భవనం ఉన్న భూమి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. దశాబ్దాల క్రితం లక్షల్లో కొన్న ఫ్లాట్లు నేడు కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి డిప్రిసియేషన్ గురించి ఆందోళన చెందకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీ-డెవలప్‌మెంట్ ప్రయోజనం:
Image Credit : Gemini AI

రీ-డెవలప్‌మెంట్ ప్రయోజనం:

ఒకవేళ అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిపోయే స్థితికి వచ్చినా, అందులో ఉండే ఫ్లాట్ యజమానులకు రీ-డెవలప్‌మెంట్ రూపంలో కొత్త అపార్ట్మెంట్ లభిస్తుంది. బిల్డర్‌కు కొంత మొత్తం చెల్లించి మళ్ళీ కొత్త ఫ్లాట్ పొందవచ్చు, దీని వల్ల పాత ఆస్తి కాస్తా సరికొత్తగా మారుతుంది. ఇది మీ మొదటి పెట్టుబడికి భారీ అప్రిసియేషన్‌ను జోడిస్తుంది. భూమిలో ఉండే వాటా(UDS) ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది.

Related Articles

Related image1
Business Ideas: మీకు ఖాళీ స్థలం ఉందా? ఉన్న ఊరిలోనే ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. డ‌బ్బే డ‌బ్బు..
Related image2
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
35
ఫ్లాట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్:
Image Credit : pexels

ఫ్లాట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్:

ఇండిపెండెంట్ హౌస్ విలువ ఆరేళ్లకు రెట్టింపు అయితే, అపార్ట్మెంట్ ఫ్లాట్ విలువ 10 ఏళ్లకు రెట్టింపు అవుతుంది. అయితే అపార్ట్మెంట్లో మీకు మొదటి నెల నుంచే అద్దె రూపంలో ఆదాయం ప్రారంభమవుతుంది. ఈ అద్దె ఆదాయాన్ని కూడా కలిపి చూస్తే రెండింటి ప్రయోజనాలు దాదాపు ఒకేలా ఉంటాయి. మన బడ్జెట్, అవసరాలను బట్టి ఏది కొన్నా లాభమే తప్ప నష్టం ఉండదు.

45
చారిత్రక ధరల విశ్లేషణ:
Image Credit : Getty

చారిత్రక ధరల విశ్లేషణ:

2001లో హైదరాబాద్‌లో 6 లక్షలకు లభించే ఫ్లాట్ నేడు కనీసం 50 లక్షల కంటే తక్కువకు దొరకదు. గత 23 ఏళ్లలో ఈ ఫ్లాట్ విలువ తగ్గకపోగా అనేక రెట్లు పెరిగింది. రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎక్కడైనా ఆస్తి విలువ తగ్గిన సందర్భాలు లేవని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. కాబట్టి కాలం గడిచే కొద్దీ ఆస్తి విలువ పెరుగుతుందే తప్ప తరగదు.

55
పెట్టుబడి, ఎంజాయ్‌మెంట్:
Image Credit : Getty

పెట్టుబడి, ఎంజాయ్‌మెంట్:

ఇల్లు అనేది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మన సంతోషం కూడా. డిప్రిసియేషన్ అనే భయంతో ఫ్లాట్ కొని అందులో ఉండటం ఆపవద్దు. ఏ రోజు అమ్మినా మీ పెట్టుబడి కంటే ఎక్కువే వస్తుంది. కాబట్టి హ్యాపీగా అపార్ట్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి. అద్దె ఆదాయం, ఆస్తి విలువ పెరుగుదల రెండూ కలిపి మీ ఫైనాన్షియల్ భవిష్యత్తును భద్రంగా ఉంచుతాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Business Ideas: మీకు ఖాళీ స్థలం ఉందా? ఉన్న ఊరిలోనే ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. డ‌బ్బే డ‌బ్బు..
Recommended image2
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved