MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • Promissory Note: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు వ్రాయొచ్చు.? అందరూ చేసే తప్పులివే

Promissory Note: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు వ్రాయొచ్చు.? అందరూ చేసే తప్పులివే

Promissory Note: ప్రామిసరీ నోటు, చెక్కుల ద్వారా అప్పు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన చట్టపరమైన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకోండి. ప్రామిసరీ నోటు మూడేళ్ల గడువు, చెక్ బౌన్స్ అయితే క్రిమినల్ కేసు వేసే విధానం.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 13 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రామిసరీ నోటు చేసే సమయంలో తప్పులు..
Image Credit : Pinterest

ప్రామిసరీ నోటు చేసే సమయంలో తప్పులు..

సమాజంలో వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలు జరగడం సర్వసాధారణం. అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు నమ్మకంతో పాటు సరైన పత్రాలు ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ప్రామిసరీ నోటు, చెక్కులు రాసేటప్పుడు చేసే చిన్న తప్పులు భవిష్యత్తులో పెద్ద చట్టపరమైన చిక్కులకు దారితీస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రామిసరీ నోటు: పరిమితులు, నిబంధనలు
Image Credit : Pinterest

ప్రామిసరీ నోటు: పరిమితులు, నిబంధనలు

ప్రామిసరీ నోటు అనేది అప్పు తీసుకున్న వ్యక్తి, నిర్ణీత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని రాసిచ్చే ఒక వాగ్దాన పత్రం. ఒక ప్రామిసరీ నోటు రాసిన తేదీ నుండి కేవలం మూడేళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ లోపు అప్పు తీరకపోతే, పాత నోటును రద్దు చేసి కొత్తది రాయించుకోవాలి లేదా కోర్టులో సివిల్ కేసు దాఖలు చేయాలి. నోటుపై తప్పనిసరిగా రెవెన్యూ స్టాంప్ ఉండాలి. దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం లేదా వేలిముద్ర ఉండాలి.

35
చెక్ బౌన్స్: క్రిమినల్ కేసు ముప్పు
Image Credit : Pinterest

చెక్ బౌన్స్: క్రిమినల్ కేసు ముప్పు

చాలామంది ప్రామిసరీ నోటుతో పాటు సెక్యూరిటీగా చెక్కులను తీసుకుంటారు. చెక్కుల ద్వారా జరిగే లావాదేవీలు సివిల్ పరిధితో పాటు క్రిమినల్ పరిధిలోకి కూడా వస్తాయి.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ (సెక్షన్ 138): బ్యాంక్ ఖాతాలో తగినంత నగదు లేక చెక్ బౌన్స్ అయితే, అది నేరంగా పరిగణిస్తారు.

లీగల్ నోటీసు: చెక్ బౌన్స్ అయిన 30 రోజుల లోపు లీగల్ నోటీసు పంపాలి. నోటీసు అందిన 15 రోజుల లోపు నగదు చెల్లించకపోతే, ఆ తర్వాత 30 రోజుల లోపు కోర్టులో కేసు వేయవచ్చు. ఈ కేసులో నిరూపితమైతే జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంది.

45
అప్పు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
Image Credit : Pinterest

అప్పు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

ఎంతటి నమ్మకస్తులకైనా అప్పు ఇచ్చేటప్పుడు రాతపూర్వక ఆధారాలు(ప్రామిసరీ నోటు లేదా అగ్రిమెంట్) తప్పనిసరిగా ఉంచుకోవాలి. సాక్షుల సంతకాలు తీసుకోవడం మర్చిపోకూడదు. చెక్కులపై సంతకం, తేదీలను జాగ్రత్తగా గమనించాలి. ఫోర్జరీ సంతకాలు ఉంటే చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్ద మొత్తంలో నగదు ఇచ్చేటప్పుడు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ చేయడం వల్ల బలమైన ఆధారాలు ఉంటాయి.

55
ప్రామిసరీ నోటు గడువు..
Image Credit : Pinterest

ప్రామిసరీ నోటు గడువు..

ఆర్థిక లావాదేవీలు నమ్మకం మీద ఆధారపడి ఉన్నప్పటికీ, చట్టపరమైన రక్షణ కోసం సరైన పత్రాలను సిద్ధం చేసుకోవడం మేలు. ప్రామిసరీ నోటు గడువు ముగియక ముందే అప్రమత్తమవ్వడం, చెక్కుల విషయంలో కాలపరిమితిని పాటించడం ద్వారా మీ సొమ్మును భద్రంగా తిరిగి పొందవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Business Idea: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియా.. నెలకు రూ. 30 వేల సంపాదన.. అదేంటంటే..
Recommended image2
Business Idea: సొంతూరిలోనే స్టార్ట్ చేయొచ్చు.. మందుల షాప్‌తో మంచి బేరాలు.. ఎలాగంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved