రోజుకు రూ. 2 లతో రూ. 15 లక్షలు.. తపాలా శాఖ కొత్త పాలసీ..
Postal Accident Insurance Policy: భారతీయ పోస్టాఫీస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో కలిసి హెల్త్ ప్లస్ ప్రమాద బీమా పాలసీని ప్రవేశపెట్టింది. ఏడాదికి కేవలం రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షల కవరేజీ పొందవచ్చు. అంటే రోజుకు రూ.2 తో పాలసీ లభిస్తుంది.

రోజుకు రూ. 2లతో రూ. 15 లక్షలు
Postal Accident Insurance Policy: ప్రమాద బీమా పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరం. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో ఆసరానిస్తుంది. ఇందుకోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది.
భారతీయ పోస్టాఫీస్ డిపార్ట్ మెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థలు కలిసి హెల్త్ ప్లస్ ప్రమాద బీమా పాలసీని ప్రవేశపెట్టింది. ఏడాదికి కేవలం రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షల కవరేజీ పొందవచ్చు. అంటే నెలకు రూ.62, రోజుకు సుమారు రూ.2 చెల్లించడం ద్వారా పాలసీ లభిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
అర్హతలు :
భారతీయ పోస్టాఫీస్ ప్రమాద బీమా పాలసీ కోసం 18 నుంచి 65 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ కోసం దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్లడం తప్పనిసరి. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, దానితో లింక్ అయిన ఫోన్ నంబర్ ఉండాలి.
కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే పాలసీ ఇవ్వబడుతుంది. గమనించవలసిన విషయం ఏమిటంటే.. సాయుధ బలగాలకు ఈ పాలసీ వర్తించదు. ఈ అర్హతలను పూర్తి చేసిన వారికే పాలసీ లభిస్తుంది, ఇది అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కోసం ఉపయోగకరంగా ఉంటుంది.
చెల్లించాల్సిన ప్రీమియం :
పోస్టాఫీస్ ప్రమాద బీమా పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియం చాలా సౌకర్యవంతంగా ఉంది. రోజుకు కేవలం రూ.1.50 చెల్లించడం ద్వారా రూ.10 లక్షల విలువైన బీమా పొందవచ్చు.
అలాగే.. రోజుకు రూ.2 చెల్లించడం ద్వారా రూ.15 లక్షల విలువైన బీమా పొందవచ్చు. వార్షిక ప్రీమియం పరంగా చూసితే, ఏడాదికి రూ.549 చెల్లిస్తే అకాల మరణాల కోసం రూ.10 లక్షల పాలసీ, రూ.749 చెల్లిస్తే రూ.15 లక్షల విలువైన పాలసీ అందుబాటులో ఉంటుంది.
బీమా కవరేజ్ :
పోస్టాఫీస్ ప్రమాద బీమా పాలసీ ద్వారా ఘటనల కారణంగా ఏర్పడిన అనేక పరిస్థితుల కోసం ఆర్థిక రక్షణ లభిస్తుంది.
- ఏదైనా ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే పూర్తి బీమా సొమ్ము చెల్లిస్తారు.
- అంగవైకల్యం కాని, పక్షవాతం వచ్చిన సందర్భంలో కూడా పూర్తి బీమా లభిస్తుంది.
- ప్రమాదం కారణంగా వ్యక్తి కోమాలోకి వెళ్తే రూ.1 లక్ష వరకు బీమా కవర్ ఉంటుంది.
- ఎముకలు విరిగితే, ఆ ఖర్చులకు కూడా రూ.1 లక్ష వరకు చెల్లింపు జరుగుతుంది.
- తలకు దెబ్బతగిలి మానసిక ఇబ్బందులు ఏర్పడితే నాలుగు కన్సల్టెంట్‌లకు ఉచిత సలహా అందించబడుతుంది.
వైద్య ఖర్చుల కోసం..
- వైద్య ఖర్చుల కోసం, ఓ.పి.డి సేవలకు రూ.30,000 వరకు, లేదా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10 సార్లు రూ.1,500 విలువైన కన్సల్టేషన్లు పొందవచ్చు.
- ఆసుపత్రిలో చికిత్స పొందినట్లయితే రూ.60,000 వరకు చెల్లింపు ఉంటుంది.
- ప్రమాదం జరిగి వేరే చోట మరణిస్తే, వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి రూ.25,000 వరకు చెల్లిస్తారు. అదేవిధంగా, ప్రమాదంలో మరణించిన వ్యక్తి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు రూ.5,000 వరకు భరోసా సొమ్ము లభిస్తుంది.
- పిల్లల విద్యా ప్రయోజనాల కోసం ఇద్దరు పిల్లలకు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు లభిస్తుంది. ఫీజులు తక్కువగా ఉంటే ఆ మొత్తం చెల్లించబడుతుంది.