ఏడాదికి రూ.755 కడితే రూ.15 లక్షల బీమా
పోస్టల్ శాఖలో ఈ ఒక్క పాలసీ గురించి తెలిస్తే మీరు షాకవుతారు.. ఇన్ని ఉపయోగాలున్నాయా అంటూ ఆశ్చర్యపోతారు. ముందుచూపుతో ఆలోచించి తప్పకుండా రూ.755 పాలసీ తీసుకుంటారు. ఈ పాలసీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.. రండి..
రూ.15 లక్షల ప్రమాద బీమా..
పోస్టాఫీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఉత్తరాలు, ఎస్‌డీ, ఆర్డీలు. కాని ఇన్స్యూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయని తెలుసా.. సంవత్సరానికి కేవలం రూ.755 కడితే రూ.15 లక్షల ప్రమాద బీమాను భారతీయ పోస్టల్ శాఖ ఇస్తోంది. అంతేకాకుండా ఆ కుటుంబానికి అండగా మరిన్ని సదుపాయాలు కల్పిస్తోంది.
హాస్పిటల్ ఖర్చులకూ డబ్బులిస్తుంది..
పోస్టల్ శాఖలో సంవత్సరానికి రూ.755 కడితే రూ.15 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నారు. అంతేకాకుండా రూ.లక్ష హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారు. అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాదానికి గురైతే హాస్పిటల్ లో చేరితే ఖర్చులకు రూ. లక్ష ఇస్తారు. దీంతో పాటు ఐసీయూలో ఉంటే రోజుకు రూ.2000, సాధారణ వార్డులో ఉంటే రోజుకు రూ.1000 ఖర్చుల కోసం పోస్టల్ శాఖ ఇస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీగా ఉన్న వారికి రూ.15 లక్షలు అందజేస్తారు.
కూతురు పెళ్లికి రూ.లక్ష..
రూ.755 ప్రమాద బీమా తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే, వారికి కూతురు కనుక ఉంటే ఆమె పెళ్లి కోసం అదనంగా మరో రూ.లక్షను భారతీయ పోస్టల్ శాఖ ఇస్తుంది. దీని కోసం పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
చదువుకు మరో లక్ష..
అంతేకాకుండా పాలసీదారుడికి చదువుకొనే పిల్లలుంటే వారి చదువు కోసం మరో రూ.లక్ష కూడా పోస్టల్ శాఖ ఇస్తుంది. ఇదంతా కేవలం రూ.755 పాలసీకే ఇన్ని సదుపాయాలు కల్పిస్తోంది ఇండియన్ పోస్టల్ శాఖ. ఈ పాలసీ తీసుకోవడానికి మీ దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.