- Home
- Business
- అసలు అలాగే ఉంటుంది, వడ్డీ నెలకు రూ. 20 వేలు వస్తాయి.. రిటైర్మైంట్ తర్వాత జీవితం బిందాస్
అసలు అలాగే ఉంటుంది, వడ్డీ నెలకు రూ. 20 వేలు వస్తాయి.. రిటైర్మైంట్ తర్వాత జీవితం బిందాస్
ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక అవసరాల తీరడానికి చాలా మంది అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులైతే ఎలాగో పెన్షన్ వస్తుంది. మరి ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి పరిస్థితి ఏంటి.? అలాంటి వారికోసమే ఒక మంచి పథకం అందుబాటులో ఉంది.

రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు
రిటైర్మెంట్ లైఫ్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు తగ్గవు కానీ ఆదాయం ఆగిపోతుంది. అలాంటి సమయంలో సేఫ్‌గా, గవర్నమెంట్ హామీతో వచ్చే స్కీమ్ కావాలనుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు. పోస్టాఫీస్ ద్వారా లభించే ఈ స్కీమ్ రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీని అందిస్తుంది.
KNOW
ఈ పథకానికి ఎవరు అర్హులు?
* 60 ఏళ్లు పూర్తయిన వారు ఈ పథకంలో చేరవచ్చు.
* 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో VRS తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
* డిఫెన్స్ సర్వీసెస్ నుంచి (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) రిటైర్ అయ్యే వారు 50 ఏళ్ల నుంచే ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు.
SCSSలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు
* ప్రస్తుతం ఈ స్కీమ్ వార్షికంగా 8.2% వడ్డీ ఇస్తోంది. ఇది బ్యాంక్ FDల కంటే ఎక్కువ.
* ఇన్వెస్ట్‌మెంట్ మొత్తానికి గవర్నమెంట్ హామీ ఉండటంతో పూర్తి భద్రతగా ఉంటుంది.
* ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది.
* అయితే వడ్డీపై వచ్చిన ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని గుర్తుంచుకోవాలి.
నెలకు రూ.20,000 పైగా ఎలా సంపాదించవచ్చు?
* ఈ పథకంలో గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.
* 8.2% వడ్డీ రేటు ప్రకారం, ఏడాదికి దాదాపు రూ.2.46 లక్షలు వడ్డీ వస్తుంది.
* అంటే నెలకు సుమారు రూ.20,500 రెగ్యులర్ ఇన్‌కమ్ పొందొచ్చు.
* అలాగే రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలకు రూ.10,250 సంపాదించవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత మెడికల్ ఖర్చులు, అవసరాలకు ఈ స్థిరమైన ఇన్‌కమ్ ఉపయోగపడుతుంది.
ముఖ్యమైన విషయాలు
* ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు.
* డిపాజిట్ మొత్తాన్ని రూ.1,000 మల్టిపుల్స్‌లో పెట్టాలి.
* స్కీమ్ వ్యవధి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత అదనంగా 3 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.
* అవసరమైతే ప్రీమెచ్యూర్ క్లోజింగ్ ఆప్షన్ కూడా ఉంది.
* జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ప్రైమరీ హోల్డర్ పేరుతోనే డిపాజిట్ చేయాలి.