రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.15 లక్షలు ఆదాయం: ఇంత మంచి పోస్టల్ స్కీమ్ మీరు చూసి ఉండరు
మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టండి. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మూడు రెట్లు సంపాదించవచ్చు. పోస్టల్ స్కీమ్స్ లో ఇంతకంటే బెస్ట్ పథకాన్ని మీరు చూసి ఉండరు. ఈ స్కీమ్ గురించి మరింత డీటైల్డ్ గా తెలుసుకుందాం రండి.
బిడ్డలకూ మంచి భవిష్యత్తును ఇవ్వాలని తల్లిదండ్రలంతా కోరుకుంటారు. దీని కోసం పిల్లలు పుట్టిన వెంటనే సేవింగ్ స్కీమ్స్ గురించి ఆలోచిస్తారు. కొందరు పిల్లల పేరు మీద పీపీఎఫ్, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. మరికొందరు FDలు చేస్తారు.
మీరు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టల్ లో అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఒక బెస్ట్ పథకం ఏంటంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ ప్లాన్. అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడం అన్నమాట.
బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీసులో 5 సంవత్సరాల FD మెరుగైన వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం ద్వారా మీరు కోరుకుంటే ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవచ్చు. అంటే మీరు రూ.5,00,000 పెట్టుబడి పెడితే రూ.15,00,000 కంటే ఎక్కువ సంపాదించవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం రండి.
రూ.5 లక్షలను రూ.15 లక్షలుగా మార్చడం ఇలా..
రూ.5 లక్షలను రూ.15 లక్షలుగా మార్చడానికి మీరు ముందుగా 5 సంవత్సరాలకు పోస్ట్ ఆఫీస్ FDలో రూ.5,00,000 పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల FDకి 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం లెక్కించినట్లయితే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. ఈ మొత్తాన్ని మీరు విత్ డ్రా చేయవద్దు. మరో 5 సంవత్సరాలకు దాన్ని కొనసాగించండి.
అంటే రూ.7,24,974 ను మరో 5 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేయండి. ఈ అయిదేళ్లు పూర్తయ్యే సరికి సుమారు రూ.10 లక్షలకు పైగా వస్తుంది. ఆ అమౌంట్ మెచ్యురిటీ అయిన తర్వాత కూడా వెంటనే విత్ డ్రా చేయకండి. వచ్చిన రూ.10 లక్షలకు పైగా మొత్తాన్ని మరో 5 ఏళ్లు FD రూపంలో పెట్టుబడి పెట్టి కొనసాగించండి. ఇలా ఈ అయిదు సంవత్సరాలు కూడా పూర్తయ్యే సరికి మీకు రూ.15 లక్షలకు పైగా డబ్బు అందుతుంది. అంటే మొత్తం 15 సంవత్సరాలకు గాను మీరు రూ.5 లక్షలు మాత్రమే పెట్టుబడి పెడితే 15వ సంవత్సరంలో కేవలం వడ్డీ మాత్రమే రూ.10,24,149 రూపాయలు మీరు తీసుకుంటారు.
FD నియమాలను తెలుసుకోండి..
రూ.5 లక్షలకు రూ.15 లక్షలు మీరు పొందాలంటే పోస్ట్ ఆఫీస్ FDని రెండుసార్లు కొనసాగించాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పోస్ట్ ఆఫీస్ FDని మెచ్యూరిటీ తేదీ నుండి 6 నెలల్లోపు రీస్టోర్ చేసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ TD వడ్డీ రేట్లు
బ్యాంకుల మాదిరిగానే పోస్ట్ ఆఫీసులలో కూడా వివిధ రకాల FDలను మీరు ఎంపిక చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు కూడా వేర్వేరు గా ఉంటాయి.