Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Saving Scheme: నెలకు రూ. 5 వేలు పొదుపు చేస్తే రూ. 8.5 లక్షలు పొందొచ్చు.. బెస్ట్ స్కీమ్‌

Saving Scheme: నెలకు రూ. 5 వేలు పొదుపు చేస్తే రూ. 8.5 లక్షలు పొందొచ్చు.. బెస్ట్ స్కీమ్‌

రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. వచ్చిన జీతంలో ముందు పొదుపు చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన పెరగడంతో చాలా మంది రకరకాల పొదుపు పథకాలవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఆకర్షణీయమైన పథకాలతో పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఒక బెస్ట్‌ సేవింగ్ స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Narender Vaitla | Published : Apr 16 2025, 06:17 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత సేవ్‌ చేయాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తారు. కొందరు స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడితే మరికొందరు చిట్టీలు వేస్తారు. అయితే వీటిలో ఎంతో కొంత రిస్క్‌ ఉంటుంది. అయితే ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ పొందేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పోస్టాఫీస్‌లో అందిస్తున్న బెస్ట్‌ స్కీమ్స్‌లో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ఒకటి.

25
Asianet Image

ఇందులో నచ్చినంత పొదుపు చేసుకోవచ్చు. నెల నెలా పొదుపు చేస్తూ వెళ్లొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత మీరు పెట్టుబడిగా పెట్టిన దాంతో పాటు వడ్డీ కలిపి వస్తుంది. అయితే ఈ పథకాన్ని మరో ఐదేళ్లు కూడా పెంచుకోవచ్చు. అంటే మొత్తం 10 ఏళ్ల వరకు ఇందులో పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. 
 

35
Asianet Image

రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా ఎంతైనా సేవింగ్ చేసుకోచ్చు. ఒక ఏడాది పాటు పెట్టుబడి పెడితే ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తంలో 50 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఇందుకు 8.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ. 5 వేలు పొదుపు చేస్తూ వెళితే పదేళ్లకు మీ చేతికి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

45
Asianet Image

ప్రతీ నెల రూ. 5 వేలు పొదుపు చేస్తే.. ఐదేళ్లలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 3 లక్షలు  అవుతుంది. దీనికి వడ్డీ రూపంలో రూ. 56,830 జమ చేస్తారు. ఇలా మొత్తం రూ. 3,56,830 అవుతుంది. అయితే మరో ఐదేళ్లు పొడగిస్తే 10 ఏళ్లకు అసలు రూ. 6 లక్షలు అవుతుంది. వడ్డీతో కలుపుకుంటే పదేళ్లలో రూ. 8.5 లక్షలు చేతికి వస్తాయి. ఇలా నెలకు కేవలం రూ. 5 వేలు పొదుపు చేస్తూ రూ. 8.5 లక్షలు పొందొచ్చన్నమాట. 

55
Asianet Image

మరిన్ని లాభాలు

మీ డబ్బుకు భద్రతతో పాటు నమ్మకమైన రిటర్న్స్‌ మాత్రమే కాకుండా ఈ రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో మరో లాభం కూడా ఉంది. అదే వడ్డీపై టీడీఎస్‌. ఐటీఆర్‌ క్లెయిమ్‌ చేసిన తర్వాత ఆదాయం ప్రకారం తిరిగి చెల్లిస్తారు. ఆర్డీపై వచ్చే వడ్డీపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. RD పై వడ్డీ రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటే.. TDS తీసి వేస్తారు.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 
Recommended Stories
Top Stories