MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • దీపావ‌ళి రోజు జ‌గ‌న్ వేసుకుంది మహిళల షూసేనా.? అసలు నిజం ఏంటీ.? వీటి ధర ఎంతంటే.?

దీపావ‌ళి రోజు జ‌గ‌న్ వేసుకుంది మహిళల షూసేనా.? అసలు నిజం ఏంటీ.? వీటి ధర ఎంతంటే.?

Viral News: సోష‌ల్ మీడియాలో ఎప్పుడు, ఏది, ఎందుకు వైర‌ల్ అవుతుందో అర్థం కాదు. తాజాగా ఇలాంటి ఓ అంశం నెట్టింట చ‌ర్చ‌కు తెర తీసింది. అదే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌రించిన బూట్ల‌కు సంబంధించి అంశం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 21 2025, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దీపావ‌ళి రోజున జ‌గ‌న్
Image Credit : gangula_suryanarayanareddy/instagram

దీపావ‌ళి రోజున జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ప‌ర్యాట‌న ముగించుకొని వ‌చ్చిన జ‌గ‌న్‌.. సోమ‌వారం త‌న ఇంట్లో జ‌రిగిన దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క్రాక‌ర్స్ కాల్చుతూ స‌రదాగా గ‌డిపారు. అయితే ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ రెడ్డి ధరించిన షూల‌కు సంబంధించి నెట్టింట ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మ‌హిళ‌ల షూస్ అంటూ ప్ర‌చారం
Image Credit : gangula_suryanarayanareddy/instagram

మ‌హిళ‌ల షూస్ అంటూ ప్ర‌చారం

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌రించిన షూస్ మ‌హిళ‌లవి అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రాజ‌కీయ దురుద్దేశంతో ఇలాంటి నెగిటివ్ పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్టులు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ ప్ర‌చారంలో ఏమాత్రం నిజం లేదు. కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు.

35
ఇంతకీ షూస్‌ల సంగ‌తేంటంటే.?
Image Credit : asics.co.in

ఇంతకీ షూస్‌ల సంగ‌తేంటంటే.?

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌రించిన షూల‌ను ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే అవి asics కంపెనీకి చెందిన‌విగా తేలింది. ఈ కంపెనీ ర‌న్నింగ్ షూస్‌ల‌ను త‌యారు చేసే ప్ర‌ముఖ బ్రాండ్‌. ASICS కార్పొరేషన్ జ‌పాన్‌కు చెందిన సంస్థ‌. ఇది క్రీడా పరికరాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందింది. Asics sneakers (రన్నింగ్ షూస్) కోసం ముఖ్యంగా గుర్తింపు పొందింది, కానీ ఈ కంపెనీ సాండల్స్ వంటి ఇతర పాదరక్షలు, అలాగే వస్త్రాలు (టి-షర్ట్స్, జాకెట్లు, హూడీస్, స్విమ్‌వేర్, కంప్రెషన్ గార్మెంట్స్, లెగింగ్స్, సాక్స్) తో పాటు బ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, క్యాప్స్ వంటివి కూడా తయారు చేస్తుంది. “Asics” పేరు లాటిన్ పదజాలం anima sana in corpore sano (అర్ధం: “సంతులిత మనస్సు, సౌకర్యవంతమైన శరీరం”) నుంచి రూపొందించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం జపాన్‌లోని కోబే, హ్యోగో ప్రిఫెక్చర్‌లో ఉంది.

45
ధ‌ర ఎంత అంటే.?
Image Credit : asics.co.in

ధ‌ర ఎంత అంటే.?

కంఫ‌ర్ట్‌కి, నాణ్య‌త‌కు పెట్టింది పేరైన ఈ కంపెనీ షూల ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం. జ‌గ‌న్ రెడ్డి ధ‌రించిన షూల అస‌లు ధ‌ర రూ. 10,999గా ఉండ‌గా.. డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,799కి అందుబాటులో ఉంది. ఈ షూలు పురుషుల కోస‌మే అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

55
వీటి ప్ర‌త్యేక‌త ఏంటంటే.?
Image Credit : asics.co.in

వీటి ప్ర‌త్యేక‌త ఏంటంటే.?

రోజువారీ ఉపయోగానికి అనుకూలంగా ఉండే ఈ న్యూట్రల్ ట్రైనర్ మీ పాదాల కింద‌ ఉన్న కుషనింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించారు. FF BLAST™ PLUS కుషనింగ్ తేలికపాటి, ఉత్సాహభరితమైన రైడ్‌ను అందిస్తుంది. FLUIDRIDE అవుట్‌సోల్ మరింత సాఫీగా, వేగంగా నడిచే అనుభూతిని కలిగిస్తుంది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైరల్ న్యూస్
ఫ్యాక్ట్ చెక్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
మీ డ‌బ్బులే డ‌బ్బుల‌ను సంపాదిస్తాయి.. ఇలా చేస్తే ప్ర‌తీ నెల మీ అకౌంట్‌లోకి రూ. 9 వేలు వచ్చేస్తాయి
Recommended image2
ఇల్లు క‌ద‌ల‌కుండా ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం.. క‌ర్పూరం త‌యారీతో లాభాల వ‌ర్షం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved