- Home
- Business
- PM Wani: మీకు వైఫై కనెక్షన్ ఉందా.? అయితే మీరు డబ్బులు సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోవాల్సిందే
PM Wani: మీకు వైఫై కనెక్షన్ ఉందా.? అయితే మీరు డబ్బులు సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోవాల్సిందే
PM Wani: ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరి ఇంట్లో వైఫై ఉంటోంది. అయితే ఈ వైఫై ద్వారా కేవలం మీరు ఇంటర్నెట్ ఉపయోగించుకోవడమే కాకుండా డబ్బులు కూడా సంపాదించవచ్చని తెలుసా.?

పీఎం వాణి పథకం
PM-WANI పథకాన్ని దూరసంచార విభాగం (DoT) 2020 డిసెంబర్‌లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌లను పెంచి, చౌకైన ఇంటర్నెట్ సదుపాయాలను అందించడం లక్ష్యం. ప్రభుత్వం ఈ ప్రణాళిక ద్వారా వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద, గ్రామీణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.
PM-WANI పథకంలోని ముఖ్య అంశాలు
1. పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO):
స్థానిక దుకాణాలు లేదా చిన్న వ్యాపారాలు పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO)లుగా నమోదు చేసుకుని WANI-సర్టిఫైడ్ వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటుచేస్తాయి. వీరు DoT నుంచి ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
2. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ (PDOA):
PDOలను కలిపి, వాటి ఆథరైజేషన్, అకౌంటింగ్ వంటి పనులను నిర్వహిస్తుంది.
3. యాప్ ప్రొవైడర్:
వినియోగదారులు తమ ప్రాంతంలో ఉన్న WANI వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించి కనెక్ట్ కావడానికి సహాయపడే యాప్‌ను అభివృద్ధి చేస్తారు.
4. సెంట్రల్ రిజిస్ట్రీ:
PDOలు, PDOAలు, యాప్ ప్రొవైడర్ల వివరాలను నిర్వహించే కేంద్ర డేటాబేస్ ఇది. దీన్ని ప్రస్తుతం C-DoT (Centre for Development of Telematics) నిర్వహిస్తోంది.
ఎలా ఆదాయం పొందాలి.?
* PM-WANI యాప్ లేదా అధికార వెబ్‌సైట్‌లో పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO)గా దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తు అందుకున్న తర్వాత ప్రభుత్వం ద్వారా PDO ఐడీ విడుదల చేస్తారు.
* మీ ఇంటి లేదా దుకాణం వైఫై రౌటర్‌ను నమోదు చేయాలి. రౌటర్‌లో సూచించిన సెట్టింగులు అమలు చేయాలి.
* రౌటర్‌ను పబ్లిక్ వై-ఫైగా లైవ్ చేస్తే, ఇతరులు మీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతారు.
* వినియోగించిన డేటా ఆధారంగా మీకు కమిషన్ చెల్లిస్తారు.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.?
* ఇందుకోసం ముందుగా అధికార యాప్ డౌన్‌లోడ్ చేసి PDOగా రిజిస్టర్ అవ్వండి.
* అవసరమైన డాక్యుమెంట్స్, ఫోన్ నంబరు, కాంటాక్ట్ వివరాలు అందించాలి.
* రిజిస్ట్రేషన్ పూర్తి చేశాక, మీకు PDO ఐడీ వస్తుంది. అనంతరం మీ రౌటర్ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయండి.
* రౌటర్‌లోని SSID పరిమితులు, క్యాప్టివ్ పోర్టల్ సెట్టింగ్‌లు ఆమోదించిన విధంగా మార్చండి.
జాగ్రత్తలు, సూచనలు
* మీ వ్యక్తిగత, ప్రైవేట్ డేటాను పబ్లిక్ నెట్‌వర్క్‌లో పెట్టకూడదు. పబ్లిక్ కోసం వేరు SSID ఉపయోగించండి.
* సూచించిన సెక్యూరిటీ సెట్టింగులు అమలు చేయండి. పాస్‌వర్డ్ పాలసీలు పాటించండి.
* పిల్లలు, హోమ్-సర్వర్ వంటి సంభంధిత పరికరాలను పబ్లిక్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయకండి.
PM-WANI ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించాలి?
వినియోగదారుడు పబ్లిక్ వైఫై ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించాలనుకుంటే ముందుగా WANI యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సమీపంలోని వైఫై హాట్‌స్పాట్‌ల జాబితా యాప్‌లో కనిపిస్తుంది. నచ్చిన వైఫై నెట్‌వర్క్‌ను ఎంచుకుని, ఆన్‌లైన్‌లో లేదా వౌచర్ ద్వారా చెల్లింపు చేసి ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేయండి.