సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలంటే ఇదే మంచి టైం: ఏకంగా రూ.78,000 సబ్సిడీ
సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్త ఆదా అవుతుందని అందరికీ తెలుసు. కాని ఇన్టాలేషన్ కు అయ్యే ఖర్చుకు భయపడి చాలా మంది ముందుకురారు. కాని కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య గృహ ముఫ్త్ బిజ్లీ యోజన’ పేరుతో అమలు చేస్తున్న పథకం ద్వారా మీరు సోలార్ ప్యానల్స్ పెట్టించుకుంటే మీకు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంత లభిస్తుంది? ఎలా అప్లై చేయాలి? తదితర వివరాలు తెలుసుకుందాం రండి.

ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో పీఎం సూర్య గృహ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అందువల్ల ఈ పథకం ప్రయోజనాన్ని పొందడం ఇప్పుడు ఇంకా సులభం. పీఎం సూర్య గృహ పథకం కింద మీ ఇంటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి మరో రెండు సింపుల్ పేమెంట్ ప్రాసెస్ లను కేంద్రం ఆమోదించింది.
ఈ ప్రపోజల్స్ ను పీఎం సూర్య గృహ పథకం కింద కేంద్ర ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదించింది. కొత్త మార్గదర్శకాలలో ఏముందంటే.. తమ ఇంటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రధాన మంత్రి సూర్య గృహ యోజన లబ్ధిదారులు సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడంలో అయ్యే ఖర్చుల సమయంలో నిధుల కొరతను ఎదుర్కోకూడదనేది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రధాన మంత్రి సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకం కింద మీరు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మొదటి RESCO నమూనా కింద థర్డ్ పార్టీ మీ ఇంటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తుంది. వాటిని ఏర్పాటు చేయడానికి మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్యానెల్ ఏర్పాటు చేసిన తర్వాత సోలార్ పవర్ ప్యానెల్ ద్వారా ఉపయోగించే విద్యుత్తుకు మీరు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
రెండో విధానం ఏంటంటే.. ULA (వాడుక-ఆధారిత ఇంటిగ్రేషన్) నమూనాలో DISCOMలు లేదా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కంపెనీలు మీ ఇంట్లో సోలార్ పవర్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తాయి. దీని కోసం కూడా మీరు ఎలాంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సోలార్ పవర్ ప్యానెల్ ద్వారా ఉపయోగించే విద్యుత్తుకు మీరు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు ఇప్పుడు మరింత సులభంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. జాతీయ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుంది. దీని ద్వారా లబ్ధిదారుడు సబ్సిడీ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. RESCO ఆధారిత గ్రిడ్-కనెక్ట్ చేయబడిన రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లలో పెట్టుబడిని తగ్గించడానికి చెల్లింపు భద్రతా విధానం(PSM) కోసం రూ.100 కోట్లు కేటాయించారు.
ఎంత సబ్సిడీ లభిస్తుంది?
ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది. దీనితో పాటు మీ ఇంటిపై సోలార్ రూఫ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. సోలార్ రూఫ్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంది. 2 kW వరకు ప్యానెల్‌కు ప్రభుత్వం రూ. 30,000 సబ్సిడీని, 3 kW పైన ప్యానెల్‌కు రూ. 48,000 సబ్సిడీని అందిస్తుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే https://pmsuryaghar.gov.in ని సందర్శించవచ్చు. మీరు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనుకుంటే మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు.