Diwali Gold rate: దీపావళి నాటికి బంగారం ధర ఎంత అవుతుందో తెలుసా? ముందే ఎంతోకొంత కొనండి
బంగారం ధరను (Gold rate) ఆపడం ఎవరి తరం కావడం లేదు. దసరా తర్వాత దీపావళి వచ్చేస్తోంది. ఆ దీపావళినాటికీ బంగారం ధర మరింతగా పెరుగుతుంది. కాబట్టి ఈలోపే వీలైతే ఎంతో కొంత బంగారాన్ని ముందుగానే కొనిపెట్టుకోవడం మంచిది.

యాభై శాతం పెరిగిన బంగారు ధరలు
బంగారం ధరలు ఎవరి ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి.కేవలం ఏడాదిలోనే బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయంటే ఆశ్చర్యపోవచ్చు. నిఫ్టీ ఇతర ప్రధాన సూచికలతో పోలిస్తే బంగారం మెరుగైన ఎదుగుదలను చూపించింది. భౌగోళిక రాజకీయ రంగం ఏమాత్రం ప్రభావితమైన కూడా బంగారం ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రాజకీయ అనిశ్చితి వల్ల కూడా గోల్డ్ విపరీతంగా పెరుగుతోంది.
కారణాలు ఎన్నో
భారతదేశం, టర్కీ మధ్య అనుబంధాలు సరిగా లేకపోవడం, అమెరికా ప్రభుత్వ షట్ డౌన్, వ్యవసాయేతర పేరోల్స్... వంటివి బంగారం పెరుగుదలను పెంచేస్తున్నాయి. పాకిస్తాన్, టర్కీ అజర్ బైజాన్లు కలిసి కూటమిగా ఏర్పడబోతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి భారతదేశం గ్రీస్, సైప్రస్, ఇజ్రాయిల్ తో సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. ఈ పరిస్థితులు కూడా బంగారం పెరగడానికి కారణం అవుతున్నాయి.
దీపావళికి బంగారం రేటు
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి దీపావళి నాటికి ప్రపంచంలోనే రాజకీయాలు అనుకూలంగా లేకపోతే బంగారం ధర ఇంకా పెరిగిపోతోంది. ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారం దీపావళి నాటికి బంగారం ధర 10 గ్రాములు 1.25 లక్షల రూపాయలకి చేరుకుంటుందని అంచనా. అందులోనూ దీపావళి సమయానికి పండుగ డిమాండ్ అధికంగా ఉంటుంది. దీనివల్ల బంగారాన్ని ఆ సమయంలో ఎక్కువగా కొంటారు. ముఖ్యంగా ధన త్రయోదశి నాడు బంగారం కొంటే ఎంతో మంచిదని హిందువుల నమ్మకం. కాబట్టి ఆ పండుగ కోసం బంగారం డిమాండ్ పెరిగిపోతోంది. డిమాండ్ ను బట్టి ధర కూడా పెరుగుతుంది.
తులం వస్తువు కొంటే..
అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడం కూడా బంగారం పెరగడానికి ముఖ్య కారణం. 10 గ్రాములు 1.25 లక్షల రూపాయలకు చేరుకుంటే తులం వస్తువు కొనడానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది పేద, మధ్యతరగతి వారికి ఎంతో భారంగా మారుతుంది. వారు ఏ బంగారం వస్తువు కొనలేని పరిస్థితులు ఏర్పడతాయి. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా? అని ఎంతో మంది మధ్యతరగతి, పేద తరగతికి చెందిన ప్రజలు ఎదురుచూస్తున్నారు.