- Home
- Business
- కొత్త బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నారా, అయితే రూ. 2 లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే, నెలకు లక్షల్లో ఆదాయం
కొత్త బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నారా, అయితే రూ. 2 లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే, నెలకు లక్షల్లో ఆదాయం
వ్యాపారం చేయడమే లక్ష్యమా అయితే తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ ఎలాంటి తిరుగులేదు. ప్రజలు తమ ఖాళీ సమయాల్లో బయటకు వెళ్ళి చిరుతిళ్ళు తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే వ్యాపార అవకాశంగా మలుచుకుని చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. మీరు కూడా అలాంటి ఫుడ్ బిజినెస్ ఐడియా కోసం ఎదురు చూస్తున్నారా. అయితే ఏ బిజినెస్ చేయాలో తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో బార్బిక్యూ బిజినెస్ చాలా ఫేమస్ అవుతోంది. చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్ చెయిన్స్ కూడా ఏ బార్బిక్యూ రెస్టారెంట్లను స్థాపించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే బార్బిక్యూ అనేది మనకు కొత్తేమీ కాదు. కుంపటి మీద సన్నటి సెగ ఆహార పదార్థాలను వేడి చేసుకుని తినే పద్ధతి మనకు ఎప్పటి నుంచో ఉంది.
మీరు కూడా ఈ బార్బిక్యూ బిజినెస్ చేయాలని అనుకుంటే పెద్ద రెస్టారెంట్ అవసరం లేదు. చిన్న ఫుడ్ స్టాల్ సైతం ఏర్పాటు చేసి, మీరు ఈ బార్బిక్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ముందుగా ఈ బార్బిక్యూ బిజినెస్ కోసం ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో తెలుసుకుందాం.
ఈ పుడ్ స్టాల్ ఏర్పాటు కోసం జనసమ్మర్ధం ఎక్కువ ఉన్నా స్థలాన్ని ఎంపిక చేసుకుంటే మంచిది. ఫుడ్ తయారు చేయడానికి, గ్రిల్స్ ను కొనుగోలు చేయాలి. బార్బీక్యూ గ్రిల్స్ ను ఇండియా మార్ట్ లాంటి వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పర్మినెంట్ షాపు, లేదా ఫుడ్ ట్రక్ ద్వారా కూడా ఈ బిజినెస్ చేయవచ్చు. ఫుడ్ ట్రక్ అయితే మీకు అద్దె చెల్లించాల్సిన పని లేదు. ఇక ఆహారం తయారు చేసేందుకు మీరు ముందుగా ట్రైనింగ్ తీసుకుంటే మంచిది అప్పుడే వెరైటీ ఫుడ్స్ ను ప్రజలకు అందించే అవకాశం దక్కుతుంది.
ఇక బార్బీక్యూ కోసం వెజ్, నాన్ వెజ్ మెనూలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బార్బీ క్యూ లో తినేందుకు ఇష్టపడే వారిలో నాన్ వెజ్ తినే వారు ఎక్కువగా వస్తుంటారు. అందుకే తాజా మాంసం అందుబాటులో ఉంచుకోవాలి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ లాంటివి తాజాగా అందుబాటులో ఉంచుకోవాలి. నాణ్యత పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మొదట్లో వంట సామాగ్రి అలాగే కుర్చీలు టేబుల్ వంటి వాటి కోసం దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది.
పబ్లిసిటీ కోసం మీరు పాంప్లెట్స్, లోకల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్ ను ఉపయోగించుకోవాలి. అప్పుడే మీకు చక్కటి పబ్లిసిటీ లభిస్తుంది. అలాగే జొమాటో, స్విగ్గి లాంటి ఫుడ్ డెలివరీ ఆప్స్ తో డీల్ చేసుకుంటే మీరు మరిన్ని ఆర్డర్లను పొందవచ్చు. అలాగే నాణ్యత, టేస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. బిజినెస్ చక్కగా రన్ అవుతే మీకు రెగ్యులర్ గా ఆదాయం వస్తుంది. ధరలు అధికంగా రెస్టారెంట్ తరహాలో కాకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండే రేంజులో మెయిన్ టెయిన్ చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతుంది.